Christmas Tree : ఈ సీజన్ లో మోస్ట్ పాపులర్ క్రిస్మస్ ట్రీ ట్రెండ్స్ ఇవే
Christmas 2024:క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీనే. చాలా వైరటీల్లో తయారు చేస్తున్నారు. రకరకాల ఐటెమ్స్ తో క్రియేటివిటీగా ప్రిపేర్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో డిజైన్స్ ఇక్కడ చూడండి.
Christmas Tree : ప్రస్తుతం ఎక్కడ చూసిన క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. ఈ పండక్కి ఇంటిని ఎలా డెకరెట్ చేయాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డెకరేషన్ స్టైల్స్ కోసం తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని కొత్త, ట్రెండింగ్ ఐడియాస్ ను ఇవ్వబోతున్నాం. మీరు సోషల్ మీడియా యూజర్ అయితే ఈ పని మీకు మరింత కావచ్చు. అందులో భాగంగా క్రిస్మస్ ట్రీని హాలిడే డెకర్ గా, అత్యంత స్టైలిష్ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. DIY క్రిస్మస్ చెట్లు
క్రిస్మస్ ట్రీని క్రియేట్ చేయాలంటే సమీపంలోని దుకాణం నుంచి తెచ్చే రంగురంగుల లైట్స్ గురించి ఇక మర్చిపోండి. ఏది చేసినా సొంతంగా, క్రియేటివిటీగా ఆలోచించండి. అందుకు ఉదాహరణగా ఓ సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన ఈ ఫొటోను చూడండి. ఇందులో అట్ట ముక్కలతో గుండ్రటి కుండీలను తయారు చేసి చెట్టు వలె అలంకరించారు. ఫాబ్రిక్ కోన్స్, ట్రయాంగిల్ ట్రీ వంటి ఆకారాల్లో వీటిని డెకరేట్ చేశారు. మరో పేజీలో పుస్తకాలను ఒకదానిపై ఒకటి చేరుస్తూ.. ఫైన మాత్రం స్టార్ సింబల్ ను పెట్టారు. ఇది కూడా చూడడానికి చాలా నేచురల్ గా కనిపిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
2. సస్టెయినబుల్ ట్రీస్
సుస్థిరత అనేది బజ్‌వర్డ్ నుండి వాస్తవ జీవనశైలి ఎంపికగా మారింది. క్రిస్మస్ చెట్లు కూడా దీనికి మినహాయింపేం కాదు. ఈ ట్రెండ్ ను మీరూ ట్రై చేయొచ్చు. అప్‌సైకిల్ చేసిన అలంకరణలు, ఎండిన సిట్రస్ ముక్కలు, పైన్‌కోన్‌లు, కొమ్మల వంటి సహజ ఆభరణాలను ఉపయోగించి ఈ ట్రీని క్రియేట్ చేయొచ్చు.
View this post on Instagram
3. హిప్పీ ట్రీస్
మీరు ఈ క్రిస్మస్ వైబ్ ను మరింత పెంచేందుకు క్రిస్టల్స్ ను ఉపయోగించండి. రంగు రంగుల క్రిస్టల్స్ తో క్రిస్మస్ ట్రీని క్రియేట్ చేయండి. అందులో భాగంగా పింక్ క్వార్ట్జ్, అమెథిస్ట్, స్పష్టమైన క్వార్ట్జ్ ఆభరణాలతో అలంకరించిన చెట్టును చిత్రించండి. కొంతమంది ఈ స్పటికాల ద్వారా తమ ఇంట్లోకి మంచి ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
View this post on Instagram
4. బాబుల్ క్యాస్కేడ్
మీ హాలిడేస్ పాప్ చేయడానికి బాబుల్ క్యాస్కేడ్ ను ట్రై చేయండి. ఈ సోషల్ మీడియా ట్రెండ్‌లో ఆభరణాలు చెట్టు కు వేలాడదీయడం ఎంతో ఆకట్టుకుంది. ఇది మీ జడ్జియెస్ట్ బంధువులను కూడా ఆకట్టుకోవడానికి హామీ ఇచ్చే షోస్టాపర్ లాంటిది.
View this post on Instagram
5. మినిమలిస్ట్ ట్రీస్
క్రిస్మస్ ను చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని భావించే వారికి, మినిమలిస్ట్ ట్రీ ట్రెండ్ మీ వైబ్ ను సెట్ చేస్తుంది. బేర్ కొమ్మలు, మృదువైన తెల్లని లైట్లతో డెకరేట్ చేయండి. ఇది నిజానికి చాలా అధునాతనమైనది. దీనికి తక్కువ టైం, డబ్బు అవసరమవుతుంది. ప్రతికూలత ఏమిటంటే, ఈ మినిమలిస్ట్ ట్రీని చూసిన కొందరు మీరు అలంకరణను పూర్తి చేయడం మర్చిపోయారా అని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు.
View this post on Instagram
Also Read : న్యూ ఇయర్ 2025 స్పెషల్ డైట్ ప్లాన్.. బరువును ఈజీగా, వేగంగా తగ్గడంలో హెల్ప్ చేస్తోందిలా..