అన్వేషించండి

Covid JN 1 New Symptoms : కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. నివేదించిన వైద్యులు

Covid JN 1 Symptoms : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు సాధారణమైన కరోనా లక్షణాలు మాదిరిగానే ఉంటాయంటూ వైద్యులు మొదట్లో తెలిపారు. ఇప్పుడు కొత్తగా మరో రెండు లక్షణాలను దీనిలో చేర్చారు. 

Covid JN 1 Updates : ప్రపంచ వ్యాప్తంగా కరోనా జనాలను ఎంత భయపెట్టిందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదుపు ప్రతి ఒక్కరూ కొవిడ్​ వల్ల ఏదోరకంగా నష్టపోయినవారే. వ్యాక్సిన్స్​ వేసుకోవడం వల్లనో.. సామాజిక దూరం పాటించడం వల్లనో.. కొవిడ్ రూల్స్ పాటించడం వల్ల దాని ప్రభావం తగ్గిపోయింది. దాదాపు మనకి దూరమైపోయి అంతా నార్మల్ అయిపోతుందనుకునే సరికి.. వివిధ వేరియంట్ల రూపంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇండియాలో కొవిడ్ జెఎన్​1(Covid JN 1) కేసులు పెరుగుతున్నాయి.

కొత్త లక్షణాలు కూడా ఉన్నాయట..

కేరళలో మొదటి కేసు నమోదు కాగా.. వివిధ రాష్ట్రలకు కూడా అది విస్తరించింది. తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించాలని.. మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే కొవిడ్ 19 సమయంలో వైరస్ బారిన పడినప్పుడు ఉన్న లక్షణాలే కొవిడ్ జెఎన్​1 వేరియంట్​ వల్ల కూడా ఉంటాయని తెలిపారు. అయితే తాజాగా ఈ లక్షణాల్లో మరికొన్నింటినీ చేర్చారు వైద్యులు. ఈ కొత్త లక్షణాలు కొవిడ్ జెఎన్​లో ఉంటాయని తెలిపారు. 

కొత్త లక్షణాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్ జెఎన్​1 సోకిన వారిలో మరో రెండు కొత్త లక్షణాలు గుర్తించారు. యూకే, యూఎస్, ఐస్​లాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, చైనాతో పాటు ఇండియాలో కూడా ఈ వేరియంట్ బాగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అందుకే దాని గురించి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కొత్త డేటాను విడుదల చేసింది. ముక్కు కారడం, దగ్గు, జలుబు, తలనొప్పి, వీక్ అయిపోవడం వంటి సాధారణ లక్షణాలతో పాటు.. జెఎన్ 1 వేరియంట్​ సోకిన వ్యక్తులు నిద్ర, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.  కొత్త లక్షణాలు గుర్తించడం వల్ల జెన్​ 1 వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందని వారు చెప్తున్నారు. 

ఆ లక్షణాలు కనిపించట్లేదు..

డిసెంబర్ 2023 వరకు పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని.. వింటర్​లో కరోనా ఎక్కువగానే విజృంభిస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. అయితే కొందరు వైరస్ సోకిన వ్యక్తుల్లో గతంలో మాదిరిగా రుచి, వాసన లేవని.. రీసెంట్​గా వైరస్​ బారిన పడుతున్న వారిలో రుచి, వాసన వంటి లక్షణాలు తగ్గి.. కొత్తగా నిద్రలో సమస్యలు, ఆందోళన వంటి లక్షణాలు పెరిగాయని పేర్కొంది. కాబట్టి దీని గురించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఎందుకంటే నిద్ర, ఆందోళన అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా దెబ్బతీస్తుంది కాబట్టి.. ప్రజలు దీని గురించి కచ్చితంగా అవగాహన ఉండాలి అంటున్నారు. అయితే వ్యాక్సిన్స్ వల్ల రోగిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చనేది కూడా ఉంది. ఈ క్రమంలోనే వైద్యాధికారులు టీకా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్తున్నారు.

Also Read : కొవిడ్ జెఎన్ 1​ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh America Tour: టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
Hyderabad News: హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
Suriya : ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh America Tour: టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
Hyderabad News: హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
హైదరాబాద్‌లో ఐదుగురికి మించి కలిసి తిరిగితే చర్యలు- నెలరోజులపాటు తీవ్ర ఆంక్షలు 
YS Sharmila And YS Jagan: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్
Suriya : ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Diwali 2024 Cleaning Hacks : దీపావళికి ఇంటిని శుభ్రం చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..
దీపావళికి ఇంటిని శుభ్రం చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..
Gold Rates: రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
Pooja Hegde : బుట్టబొమ్మ హాట్​గా మారితే.. పూజా హెగ్డే దీపావళి 2024 లుక్ చూశారా ?
బుట్టబొమ్మ హాట్​గా మారితే.. పూజా హెగ్డే దీపావళి 2024 లుక్ చూశారా ?
Embed widget