కొండచిలువను మింగేసిన పాము, దీని ఎక్స్‌రే చూస్తే షాకవుతారు
కొండ చిలువ ఏం తింటుంది? కనిపించిన జంతువులను తింటుంది. మనుషులను కూడా మింగుతుంది. కానీ.. విచిత్రంగా అమెరికాలో ఓ పాము కొండ చిలువను మింగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
పాములను చూడ్డమే కాదు.. కనీసం వాటి గురించి వింటేనే భయపడే వారు చాలా మంది ఉంటారు. కానీ, కొందరు మాత్రం పట్టుపట్టి మరీ పాముల వీడియోలను చూస్తుంటారు. రకరకాల పాములను వెతికి మరీ చూస్తుంటారు. అవి చేసే రకరకాల విన్యాసాలు చూసి, ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటివారికి ఈ ఘటన బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే.. ఓ సాధారణ పాము కొండ చిలువనే మింగేసింది మరి.
సాధారణంగా పాములు ఆకలి వేస్తే ఏం చేస్తాయి? కప్పలను తింటాయి. లేదంటే ఎలుకలను పట్టుకుని తింటాయి. అదే కొండ చిలువలైతే వేరే జంతువులను మింగేస్తాయి. కనిపిస్తే మనుషులను కూడా కడుపులోకి తోసేస్తుంటాయి. కానీ విచిత్రం ఏంటంటే.. అమెరికాలో ఓ పాము కొండ చిలువను మింగేసింది. అదేంటి? అనుకుంటున్నారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది ముమ్మాటికీ వాస్తవం.
ఈ వింత ఘటన ఫ్లోరిడాలోని జూ మియామీలో జరిగింది. వాటర్ మొకాసిన్ పాము.. బర్మీస్ పైథాన్‌ను అమాంతం మింగేసింది. తాజాగా మొకాసిస్ పామును అధికారులు ఎక్స్ రే తీయడంతో ఈ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. తాజాగా ఈ పాముకు సంబంధించిన ఎక్స్ రే ను జూ మియామీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
జూ మియామీలోని డాక్టర్లు కొంతకాలం క్రితం.. బర్మీస్ పైథాన్ ను గురించి పలు విషయాలను తెలుసుకోవాలి అనుకున్నారు. ఇందుకోసం సర్జన్లు దానికి ట్రాకింగ్ ట్రాన్స్ మీటర్ ను అమర్చారు. ఎప్పటికప్పుడు దాని కదలికలను.. రోజు వారి అది చేసే పనులను గమనిస్తున్నారు. అయితే ఈ విషయాలను గమనిస్తున్న డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది కొండ చిలువను మరొక పాము తినేసినట్లు గుర్తించారు. కాటన్ మౌత్ లేదంటే వాటర్ మొకాసిన్ గా పిలిచే ఈ పామును ఏకంగా కొండ చిలువనే మింగేసింది. తాజాగా జూ మియామీ యానిమల్ ఆసుపత్రిలో తీసిన ఈ ఎక్స్‌రే లో కాటన్ మౌత్ లోపల ఉన్న కొండచిలువ వెన్నెముకతో పాటు దానికి అమర్చిన ట్రాన్స్ మీటర్ కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్ని జూ జూ మియామీ ఫేస్‌బుక్ లో పోస్టు చేసింది.
ఆ కొండ చిలువ ఈ ఏడాదే పుట్టింది. ఆగష్టులో దానికి ట్రాకింగ్ పరికరాన్ని పరిశోధకులు అమర్చారు. ఆ తర్వాత కొండ చిలువను అడవిలోకి విడిచిపెట్టారు. ఆ తర్వాత ట్రాకింగ్ సిగ్నల్ బలహీనంగా ఉందని, పామును పరిశీలించాలి అని అనుకున్నారు. అప్పుడు వారికి పొట్ట ఉబ్బుగా ఉన్న పాము కనిపించింది. ట్రాకింగ్ సిగ్నల్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. మొత్తానికి కాటన్ మౌత్ పాము కొండ చిలువను మింగినట్లుగా పరిశోధకులు కనుగొన్నారు. వెంటనే దాన్ని ఎక్స్ రే తీశారు. అప్పుడు షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కాటన్ మౌత్ పాము కడుపులో కొండ చిలువ అస్తిపంజరం కనిపించింది. అంతేకాదు.. ఆ కొండ చిలువకు కట్టిన ట్రాన్స్ మీటర్ కూడా ఇందులో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత మౌత్ కాటన్ పాముకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిశోధకులు తిరిగి అడవిలోకి వదిలారు. సుమారు 25 రోజుల తర్వాత ఆ పాము తన కడుపులోని ట్రాకింగ్ పరికరాన్ని విసర్జించింది. ప్రస్తుతం ఈ పాము ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!