Memory: మీ జ్ఞాపకశక్తి ని పెంచే ఆహార పదార్థాలు ఇవే - తాజా అధ్యయనం వెల్లడి
మతిమరుపు వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇక మీదట ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచేస్తాయి.
వృద్ధాప్యం.. ఇది శరీరంలోనే కాదు మనసులో కూడా మార్పులు తీసుకొస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాల్సి వస్తుంది. వయస్సులో పాటు వచ్చే సాధారణ మార్పు జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు కణాలు బలహీనపడటం. అప్పుడే చేసిన పని కూడా గుర్తుండదు. కనీసం తిన్నామా లేదా అనే విషయం కూడా మర్చిపోతుంటారు. ఈ మతిమరుపు వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఆరోగ్య పరంగా మాత్రమే కాదు ఆర్థిక పరంగా కూడా కొంతమంది జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ సమస్యే ఉండదని అంటున్నారు నిపుణులు.
రెగ్యులర్ గా పాటించే డైట్ కి కొన్ని ఆహార పదార్థాలు జోడించి తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తిరిగి పొందవచ్చని నిపుణులు వెల్లడించారు. మనం తీసుకునే ఆహారం మెదడు పనితీరు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే 30 ఏళ్ల తర్వాత తీసుకునే ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ వయస్సు తర్వాత తీసుకునే ఆహారం మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తుందనే దాని మీద ఒక అధ్యయనం నిర్వహించారు.
అధ్యయనం ఏం చెప్తోంది?
సుమారు 2,138 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. శాన్ ఆంటోనియోలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ ఈ అధ్యయనం నిర్వహించింది. 46 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళని పరిశీలించగా స్ట్రోక్ సమస్యతో కాకుండా డీమెన్షియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా తీసుకోవడం వల్ల మెదడు కణాలు, కణజాలాలను పునరుత్పత్తి చేసి వాటిని మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు.
అంతే కాకుండా ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వాళ్ళ డీమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి పురోగతి మందగించడంలో సహాయపడుతుందని శాస్త్రీయంగా నిర్ధారించబడింది.
జ్ఞాపకశక్తి పెంచే ఆహారాలు
☀ అవిసె గింజలు
☀ అవకాడో
☀ కొవ్వు చేపలు
☀ లీన్ మీట్
☀ పాలు
☀ చియా గింజలు
☀ బాదంపప్పు
ఈ ఆహార వినియోగం మెదడు కణాలను ప్రేరణ పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పని తీరు చురుగ్గా ఉంటుంది. తద్వారా మతిమరుపు సమస్య నుంచి బయట పడొచ్చు. మెదడు ఎంత చక్కగా పని చేస్తే శరీరం అంత మెరుగ్గా పని చేస్తుంది. ఎందుకంటే శరీరం ఏం చెయ్యాలి అనే సంకేతాలు ఇచ్చేది మెదడు కాబట్టి.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే మెదడు పనితీరు సక్రమంగా చేసే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. వాటిలో పాలకూర, గుమ్మడి గింజలు కూడా ఉంటాయి. పాలకూరలో విటమిన్ బి6, ఐ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అల్జీమర్స్ రాకుండా నిరోధించడంలో ఫోలేట్ సహాయపడుతుంది. అలాగే రోజుకి ఒక గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకున్నా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: లోటస్ రూట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?