(Source: ECI/ABP News/ABP Majha)
Cleansing Face: రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేశారంటే అందంగా మెరిసిపోతారు
అందంగా కనిపించడం కోసం మార్నింగ్ రొటీన్ మాత్రమే కాదు నిద్రవేళకు ముందు కూడా మీ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే ప్రకాశవంతమైన చర్మం పొందుతారు.
ప్రతి రోజు రాత్రిముఖం శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేస్తున్నాం కదా సరిపోదా అని అనుకుంటారేమో. ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే నిద్రవేళకు ముందు మొహాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మ రకానికి సరిపడే విధమైన క్లెన్సర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొహం క్లీన్ చేసుకోవడానికి గోరు వెచ్చని స్వచ్చమైన నీటిని తీసుకోవాలి. రాత్రి వేళ మొహం శుభ్రం చేసుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.
చేతులు శుభ్రం చేసుకోవాలి
ముఖాన్ని తాకడానికి ముందు, ఏదైనా ఉత్పత్తులు ఫేస్ కి అప్లై చేసుకోవడానికి ముందుగా చేయాల్సిన పని చేతులు శుభ్రం చేసుకోవడం. చేతులకి ఉన్న బ్యాక్టీరియా ఫేస్ మీదకి వెళ్ళకుండా ఉండేందుకు తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి.
మేకప్ తొలగించాలి
మీకు మేకప్ వేసుకునే అలవాటు ఉంటే పడుకునే ముందు దాన్ని తొలగించాలి. లేదంటే అందులోని రసాయనాలు ఫేస్ ని మరింత పాడు చేస్తాయి. మేకప్ రిమూవర్ లేదా మైకెల్లార్ నీటిని ఉపయోగించి దాన్ని సున్నితంగా తొలగించుకోవాలి.
వేడి నీటితో కడగాలి
చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. బాగా వేడిగా ఉండే నీటిని మాత్రం వినియోగించొద్దు. ఎందుకంటే అది చర్మానికి చాలా కఠినంగా ఉంటుంది. చర్మం పొడిబారిపోయేలా చేస్తుంది.
క్లెన్సర్ అప్లై చేయాలి
చేతి వేళ్ళతో క్లెన్సర్ తీసుకుని మొహానికి సున్నితంగా రాసుకోవాలి. వృత్తాకారంలో చేతి వేళ్ళని కదిలిస్తూ మసాజ్ చేసుకోవాలి. నుదురు, ముక్కు, గడ్డం మీద సున్నితంగా మసాజ్ చేయాలి. నూనె, మురికి ఎక్కువగా పేరుకుపోయే ప్రదేశాలమీద అప్లై చేసుకుని శుభ్రం చేసుకుంటే మంచిది.
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కనీసం 20 సెకన్ల సమయం కేటాయించాలి. క్లెన్సర్ మలినాలను విచ్చిన్నం చేయడానికి అనుమతి ఇస్తుంది. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. సున్నితంగా మాత్రమే క్లెన్సర్ తో మసాజ్ చేసుకోవాలి. గట్టిగా స్క్రబ్ చేయకూడదు. అలా చేస్తే చర్మాన్ని చికాకు పెడుతుంది.
అప్లై చేసిన క్లెన్సర్ శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చర్మంపై ఎటువంటి అవశేషాలు ఉండకుండా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన మెత్తని టవల్ తో ఆరబెట్టుకోవాలి. ఫేస్ ని గట్టిగా రుద్దకూడదు. క్లెన్సింగ్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగించాలి. రోజువారీగా ఉపయోగించే సీరమ్, మాయిశ్చరైజర్ ఏవైనా అప్లై చేసుకోవచ్చు. మెడ వరకు శుభ్రపరిచే విధంగా చేసుకోవాలి. మురికి, నూనె ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే తప్పనిసరిగా మెడ శుభ్రం చేసుకోవాలి.
రాత్రిపూట క్లెన్సింగ్ మురికి, మేకప్ కాలుష్య కారకాలని తొలగిస్తుంది. అవి క్లీన్ చేసుకోకపోతే రంధ్రాలు దుమ్ముతో మూసుకుపోతాయి. చర్మ సమస్యలకి దారి తీస్తుంది. నిర్ధిష్ట సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మొటిమలు వచ్చే అవకాశం ఉంది. చర్మ రకానికి తగిన ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఉల్లిపాయ తొక్కలను పడేయకుండా ఇలా చేయండి