అన్వేషించండి

Onion Peel: ఉల్లిపాయ తొక్కలను పడేయకుండా ఇలా చేయండి

ఉల్లిపాయ తొక్కలు తీసి డస్ట్ బిన్ లో వేసేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకున్నారంటే వాటిని అసలు పడేయరు.

కుక్కపిల్ల.. సబ్బు బిళ్ళ.. అగ్గి పుల్ల కవితకి ఏది అనర్హం కాదని అంటారు కవులు. అలాగే ఏ కూరగాయలు, పండ్లు తొక్కలు కూడా ప్రయోజనాలు ఇవ్వకుండా ఉండవు. నిజానికి తొక్కల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. మనలో చాలా మంది ఉల్లిపాయ తొక్కలు తీసి చెత్త బుట్టలో వేసేస్తారు. కానీ ఉల్లిపాయ మాదిరిగానే వాటి తొక్కలు కూడా పోషకాలు కలిగి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందుతారు. ఉల్లిపాయ తొక్కలతో మీరు ఇలా స్మార్ట్ గా చేసి చూడండి.

వెనిగర్

ఉల్లిపాయ తొక్కల్ని ప్రత్యేకమైన సువాసన కలిగిన ఉల్లిపాయ ఇన్ఫ్యూజ్డ్ వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వెనిగర్ ఉన్న బాటిల్ లో ఉల్లిపాయ తొక్కలు వేసేసి గట్టిగా మూత పెట్టేయాలి. కొన్ని వారాల పాటు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచండి. ఈ వెనిగర్ ని సలాడ్ డ్రెస్సింగ్, మెరినేడ్ లో ఉపయోగించుకోవచ్చు.

తొక్కలతో టీ

ఉల్లిపాయ తొక్క టీ సంప్రదాయ వైద్యంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయని నమ్మకం. ఉల్లిపాయ తొక్కలని వేడి నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వాటిని వడకట్టుకుని తాగేయడమే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ నరాలకు విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్ర అందిస్తుంది.

క్లీనింగ్

ఉల్లిపాయ తొక్కలోని సపోనిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని చూర్ణం చేసి నీటితో కలిపినప్పుడు అది కొద్దిగా సబ్బుగా మారుతుంది. ఈ మిశ్రమంతో పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు. సహజంగా శుభ్రపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి.

జుట్టుకి కూడ

కొంతమంది ఉల్లిపాయ తొక్కల కషాయాలని హెయిర్ రిన్స్ గా ఉపయోగిస్తారు. ఈ తొక్కలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టుని ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి. వీటిలో సల్ఫర్ ఉంటుంది. దీన్ని తలకి పట్టిస్తే తెల్ల జుట్టు నుంచి బయట పడొచ్చు. ఉల్లిపాయ తొక్కలు స్టవ్ మీద పెట్టి నల్లగా అయ్యేంత వరకు వేడి చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కలబంద జెల్ లేదా నూనె కలుపుకుని హెయిర్ డై మాదిరిగా జుట్టుకి అప్లై చేసుకోవచ్చు.

కంపోస్ట్

గులాబీ మొక్కల పెరుగుదలకి చాలా మంది కుండీల్లో ఉల్లిపాయ తొక్కలు వేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇవి కంపోస్ట్ గా చక్కగా సహాయపడతాయి. ఇందులవన్నీ ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఉన్నాయి. ఇవి మొక్కలకు కావాల్సిన పోషణ అందిస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? జాగ్రత్త మతిమరుపు రావడం ఖాయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget