Eggs: కోడిగుడ్లను నీళ్లతో శుభ్రం చేస్తున్నారా? అలా చేస్తే ఎంత హానికరమో తెలుసా?
వండేముందు కోడిగుడ్లను కడిగే అలవాటు ఉందా? వెంటనే మానుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలిలో కూరగాయలు నీటితో శుభ్రం చేసి వండడం చాలా ముఖ్యం. వంటగది, ఆహారాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ కొన్ని సార్లు పరిశుభ్రత కూడా ప్రమాదకరంగా మారుతుంది. దానికి కోడి గుడ్లు కడగడమే ఉదాహరణ. వండడానికి ముందు కోడిగుడ్లు నీళ్లలో శుభ్రం చేయడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి...
ఎందుకంటే...
పౌల్టీల్లో గుడ్ల వ్యాపారం చేసేటప్పుడు గుడ్లను చాలా రోజులు పాడవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. గుడ్లను అమ్మకానికి పంపడానికి ముందే వాటిని శుభ్రం చేసి పైన క్యూటికల్ లేదా బ్లూమ్ అనే సహజ రక్షణ పూతను వినియోగిస్తారు. ఇందుకు ఎడిబుల్ మినరల్ ఆయిల్ ను కూడా ఉపయోగిస్తారు. ఇలా పూతను వేయడం వల్ల బ్యాక్టిరియా పెంకును చొచ్చుకుని లోపలికి చేరలేదు. దీనివల్ల గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కూడా. వాణిజ్యపరమైన గుడ్ల విషయంలో ఈ రక్షణ పూత పూయాలని నిబంధనలు కూడా ఉన్నాయి. నీళ్లతో కడగడం వల్ల పైనున్న రక్షణ పూతలు పోతాయి. దీంతో బ్యాక్టిరియా సులువుగా లోపలికి చేరుకుంటుంది. ఆ గుడ్లు తినడం వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది.
కొంతమంది నేరు ఫారమ్ ఫ్రెస్ గుడ్లు కొనుగోలు చేస్తారు. ఆ గుడ్లపై ఎలాంటి పూతలు ఉండవు. వాటిని వెచ్చని నీటిలో కడగవచ్చు. కానీ సూపర్ మార్కెట్లో గుడ్లు కొన్నట్టయితే వాటిని కడగడం పూర్తిగా మానేయండి. ఇది త్వరగా గుడ్లను పాడుచేయడమే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.
తాజాదో కాదో ఇలా తెలుసుకోండి...
గుడ్లు మరీ నిల్వది అయినా ఆరోగ్యసమస్యలు వస్తాయి. కాబట్టి చిన్న పరీక్ష ద్వారా గుడ్డు తాజాదనాన్ని కనిపెట్టవచ్చు. ఒక గిన్నెలో నిండుగా నీళ్లు వేయాలి. అందులో గుడ్డు వేయాలి. గుడ్డు తాజాది అయితే నీటి అడుగుకు చేరుకుంటుంది. అదే మరీ నిల్వది అయితే నీటిపై తేలిపోతుంది.తేలిపోయిన గుడ్లు తినకపోవడమే మంచిది.
ఏది మంచిది?
తెల్ల గుడ్లు, బ్రౌన్ గుడ్లు... ఈ రెండింటిలో ఏ గుడ్లు మంచిదనే విషయంలో కూడా చాలా మందికి సందేహాలున్నాయి. చాలా మంది నాటుకోడి గుడ్లుగా భావించే బ్రౌన్ గుడ్లు మంచివని అనుకుంటారు. నిజానికి రెండు గుడ్లు మంచివే. పోషకాల విషయంలో రెండూ సమానమే. రంగు మాత్రమే తేడా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. రుచిలో కాస్త తేడా ఉండే అవకాశం ఉంది. శరీరానికి అందే పోషకాలు మాత్రం ఒకటే. కాబట్టి ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ గుడ్లు అందుబాటులో ఉంటే వాటిని తినడం బెటర్.
Also read: వంటగదిలో దొరికే ఈ అయిదు పదార్థాలు ముఖానికి పూయద్దు, అవేంటంటే
Also read: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా? అది కూడా ఒక రకమైన క్యాన్సరే