Childrens Day 2023 Wishes: విరిసీ విరియని పూవుల్లాంటి పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు, తెలుగులోనే ఇలా చెప్పండి
Childrens Day 2023 Wishes in Telugu: రేపటి పౌరులైనా నేటి పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
Childrens Day 2023 Wishes in Telugu: మన జీవితంలో బాల్యదశ అద్భుతమైనది. ఆ దశ భగవంతుడు ఇచ్చిన వరమనే చెప్పాలి. పిల్లల మనసులు విరిసీ విరియని పూవులంతా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం జవహరల్ లాల్ నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. నెహ్రూకు పిల్లలంతో అనుబంధం ఎక్కువ. ఆయన ఎక్కడికి వెళ్లినా... ఆయన కళ్లు వెతికేది పిల్లల కోసమే. అందుకే నెహ్రూకు ‘చాచా నెహ్రూ’ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది ఇదే రోజున ప్రత్యేకంగా భారత తపాలా శాఖ ఓ స్టాంపును విడుదల చేస్తుంది. ఆ స్టాంపు భారతదేశంలోని పిల్లలందరికీ అంకితం.
పిల్లలకు స్వేచ్ఛను, భద్రతను, ఆనందాన్ని, వారి హక్కులను కాపాడేందుకు బాలల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. 1954లో ఐక్యరాజ్య సమితి తొలిసారి ఈ ప్రతిపాదనను తెచ్చింది. అన్ని దేశాలు బాలల దినోత్సవ ఏర్పాటుకు ఒప్పుకుని సంతకాలు చేశాయి. కానీ తమ వీలును బట్టి ఒక్కో దేశం ఒక్కో రోజున బాలల దినోత్సవం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాయి. మన దేశంలో చాచా నెహ్రూ జన్మదినం రోజున బాలల దినోత్సవం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను కూడా ఈ రోజున ప్రత్యేకంగా వెలుగులోకి తెస్తారు. పిల్లలకు విద్య, వైద్యం, చదువు, పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడడమే తల్లిదండ్రుల కర్తవ్యం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఇప్పటికే పెద్ద ఉద్యమాలు సాగాయి. ఇప్పటికీ ఎక్కడో దగ్గర బాల కార్మికులు ఉంటూనే ఉన్నారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి ఆనందాన్ని వారికి చేరువ చేయడమే బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
మీ పిల్లలకు బాలల దినోత్సవం రోజున తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. అలాగే వాట్సాప్ స్టేటస్‌లలో తెలుగు కోట్స్‌నే పెట్టండి. కింద ఇచ్చిన వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి.
1. ఈ బాలల దినోత్సవం పిల్లలందరికీ ఎంతో ఆనందాన్ని,
సంతోషాన్ని, వెలుగును అందించాలని కోరుకుంటూ
హ్యాపీ చిల్డ్రన్స్ డే
2. పిల్లల పసితనాన్ని కాపాడదాం,
వారికి చిరునవ్వులందించి భవిష్యత్తులను తీర్చి దిద్దుదాం.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
3. నేటి పిల్లలకే రేపటి నవ భారత నిర్మాతలు.
వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం
బాలలే శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుదాం
చిన్నారుందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
4. మనం వేసే ప్రతి అడుగు మన పిల్లలకు మార్గదర్శకం కావాలి
మనం చేసే ప్రతి పని వారిని ఒక చక్కని సమాజం దిశగా నడిపించాలి
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
5. పాలబుగ్గలు పసిమొగ్గలు
మన కలలకు ప్రతిరూపాలు
భారత భావి పౌరులు కాకూడదు కరెన్సీ యంత్రాలు
పిల్లలకు విద్యా బుద్ధులతో పాటూ విలువలూ నేర్పుదాం
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
6. విద్య ఎంత అవసరమో
ఆటలు అంతే అవసరం
పిల్లల హక్కుల్ని అణిచివేయకండి
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
7. విరిసీ విరియని సుమాలు
అభం శుభం తెలియని బాలలు
భావి భారత పౌరులు
భవిష్యత్తు జాతి సంపదలు
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
8. మన జీవితంలో
అందమైనవి... అద్భుతమైనవి
మళ్లీ రానివి..
మళ్లీ మళ్లీ కావాలనుకునేవి
బాల్యంలోని రోజులు.
పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
9. అందరూ అనుభవించే బాల్యం
భగవంతుడు ఇచ్చిన
ఓ అమూల్యమైన వరం
అభం, శుభం తెలియని
ఆ పసి మనసులు
పూతోటలో అప్పుడే
పరిమళించిన పువ్వులు
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
10. బోసి నవ్వుల బుజ్జాయిలు
సున్నితమైన లేలేత పూరేకులు
అల్లరి, ఆటలే వారి లోకం
అమ్మే వారికి ముఖ్యం
ప్రేమను కోరే చిన్నారులు
పగ ఎరుగని శాంతి కపోతాలు
రేపటి భావి బంగారు పౌరులు
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు