Childhood Obesity : పిల్లలు లావుగా ఉంటే మధుమేహమొచ్చే అవకాశలెక్కువట.. నిపుణుల సూచనలు ఇవే
Obesity in Kids : పిల్లల్లో ఊబకాయం ఉంటే కొన్న దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు.
Obesity in Children : చిన్నపిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. కానీ మరీ లావుగా ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందునా ఊబకాయం ఉన్నవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్తున్నారు. ఊబకాయం ఉంటే కేలరీలు వినియోగం, వ్యయంలో ఇబ్బందులు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. అయితే బాల్యంలో బరువు ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం త్వరగా వచ్చే అవకాశముందని చెప్తున్నారు.
పిల్లల్లో ఊబకాయం ఉంటే.. అది యుక్తవయసు వచ్చేసరికి మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల మధుమేహం, రక్తపోటు, డైస్లిపిడెమియా, లివర్ సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ వ్యాధులకు దారి తీస్తుందంటూ షాకింగ్ విషయాలు తెలిపారు నిపుణులు. అలాగే ఊబకాయం వచ్చిన పిల్లల్లో తెలివితేటలు కుడా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం కూడా తెలిపింది. అందుకే ఊబకాయానికి దారి తీసే పరిస్థితులకు దూరంగా ఉండేలా చూసుకోవాలని పేరెంట్స్‌కి సూచనలు ఇస్తున్నారు.
ప్రధానకారకాలు
పోషకాహారం, శారీరక వ్యాయామం వంటి జన్యూ, శారీరక, జీవనశైలి కారకలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. దీనివల్ల బీటా సెల్ పనిచేయవు. అందుకే పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో T2DM క్యాజువల్‌గా మారిపోయింది. ఊబకాయం వారసత్వంగా, పర్యావరణ సమస్యలు, జీవక్రియ, ప్రవర్తన, సంస్కృతి, సామాజిక ఆర్థిక స్థితులు ఇలా ప్రతి అంశాలు ఊబకాయాన్ని ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయాన్ని, దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు.
ఇలా కంట్రోల్ చేయవచ్చట..
ఈ మధ్యకాలంలో కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌నే పిల్లలు ఎక్కువగా తింటున్నారు. వారు ఇష్టంగా తింటున్నారు కదా అని తల్లిదండ్రులు కూడా వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. వాటిని ఎక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అందుకే కేలరీలు తక్కువగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్‌ని వారి డైట్లో చేర్చవచ్చు అంటున్నారు.
ఆన్లైన్ గేమ్స్
ఈ మధ్యకాలంలో పిల్లలు రూమ్ వదిలి బయటకెళ్లడం జరగట్లేదు. ఎంతసేపు ఫోన్ల మీదనే ధ్యాస. చదువును మొదలుకొని.. గేమ్స్ వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. దీనివల్ల వాళ్లు ఫిజికల్ యాక్టివిటీలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువసేపు కదలకుండా ఓ చోటే కూర్చొంటే.. ఊబకాయం పెరుగుతుంది. అందుకే వారిని యాక్టివ్‌గా ఉంచేందుకు బయట ఆడుకోమని చెప్పాలి. లేదంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటే వారు యాక్టివ్‌గా ఉంటారు. వారానికోసారి గ్రౌండ్‌కి తీసుకెళ్లడమో.. లేదంటే వారికి ఇష్టమైన గేమ్‌లో ప్రావీణ్యులయ్యేలా శిక్షణ ఇప్పించడమో చేయాలంటున్నారు.
ముందుగా జాగ్రత్త పడితే
పిల్లలు బరువు పెరుగుతున్నారనే డౌట్ వస్తే వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. ముందస్తు పరీక్షలు చేయిస్తే సమస్యను త్వరగా గుర్తించి వాటికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నా.. ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నా ఇవి ఊబకాయాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి వారితో రెగ్యూలర్‌గా మాట్లాడుతూ ఉండండి. వారు దేనికైనా ఇబ్బంది పడుతుంటే.. ప్రెజర్ లేకుండా హ్యాపీగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : మగవారు జాగ్రత్త.. ఈ ప్రాణాంతక క్యాన్సర్ ప్రభావం మీకే ఎక్కువట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చిట్కాలు ఇవే