అన్వేషించండి

Mahatma Gandhi : "చౌరీ చౌరా" ఘటన భారత స్వాతంత్ర్యాన్ని ఆలస్యం చేసిందా ? మహాత్ముడు తప్పు చేశారా ?

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చౌరాచారీ ఘటన చారిత్రత్మకం. గాంధీ పిలుపునిచ్చిన అహింసా ఉద్యమంలో హింస అక్కడే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది ? గాంధీపై విమర్శలెందుకు వచ్చాయి ?

చౌరీ చౌరా అంటే ఏమిటి? ఇది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చాలా దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం పేరు. ఇక్కడే వందేళ్ల క్రితం భారత్ కీలక పరిణామాలను నిర్దేశించారు. చౌరీ చౌరా పట్టణం నిండా అనేక అమరవీరుల స్మారక చిహ్నాలు ఉంటాయి.  వలస పాలన బారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం పొందేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం గోరఖ్‌పూర్ నుండి కాన్పూర్ వరకు నడిచే రైలుకు చౌరీ చౌరా ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు మార్చ్,  క్విట్ ఇండియా ఉద్యమంతో  'స్వాతంత్ర్య పోరాటం' కథనంలో దేశానికి తెచ్చిన కీర్తి తెచ్చిన ఉద్యమాల కీలక ఘట్టాలు చౌరీ చౌరాలోనే జరిగాయి. కానీ ఇది గతంలోనే కాదు ఇప్పుడుకూడా ఎవరికీ తెలియని ప్రాంతం. 

1922 లో  భారతదేశం మొత్తం మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఊపులో ఉంది. ఉత్తర భారతదేశం మొత్తం ఖిలాఫత్ ఉద్యమం ఓ మానియాలా ఆవహించింది.  గోరఖ్‌పూర్ కాంగ్రెస్,  ఖిలాఫత్ కమిటీలు వాలంటీర్లను జాతీయ దళంగా ఏర్పాటు చేయడంలో ముందంజ వేశాయి. మరియు స్వచ్ఛంద సేవకులు గ్రామాలకు పెద్ద ఎత్తున వచ్చారు. బ్రిటిష్ పోలీసులు అటువంటి రాజకీయ కార్యకలాపాలను అణిచివేసేందుకు ప్రయత్నించేవారు. ఓ సారి లాఠీచార్జ్ జరిగినప్పుడు ఓ వాలంటీర్ గాయపడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోయాయి. స్వచ్చంద సేవకలు ఊర్లోని స్థానిక బజార్‌ను దిగ్బంధించడానికి ప్రయత్నించారు.  సమీపంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. దీంతో పోలీసులు తక్షణం అందర్నీ వెనక్కి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆందోళనకారులు బ్రిటిష్ పోలీసుల మాట వినలేదు. ఓ పోలీసు అధికారి గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే పోలీసులు భయపడుతున్నారని ఆందోళన కారులకు ఓ క్లారిటీ వచ్చింది. అది వారికి మరింత ధైర్యాన్నిచ్చింది. చరిత్రకారుడు షాహిద్ అమీన్ చెప్పినట్లుగా.. 'గాంధీజీ దయతో బుల్లెట్లు నీరుగా మారాయి' అన్నట్లుగా వారంతా పోలీసు బుల్లెటన్లను తేలికగా తీసుకోవడం ప్రారంభించారు. చివరికి పోలీసులు నిజంగా మనుషుల్ని గురి పెట్టి కాల్చినా ఎవరూ వెనక్తి తగ్గలేదు. ముగ్గురు వ్యక్తులు మరణించారు.. అనేక మంది గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన జనం పోలీసులపై రాళ్లు రువ్వారు. తక్కువ మంది పోలీసులు ఎక్కువ మంది ఉద్యమకారులు ఉండటంతో పోలీసులు భయపడి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. ఆందోళనకారులు బయటి నుంచి తలుపులు వేసి బజార్‌లోని కిరోసిన్‌ పోసి ఠాణాకు నిప్పంటించారు. ఇరవై మూడు మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు. చాలా మంది కాలిపోయారు తప్పించుకుని బయటకు వచ్చిన వారిని జనం కొట్టి చంపేశారు.  

తమ పోలీసులకు ఇంత నష్టం జరిగితే బ్రిటిషన్ పాలకులు ఊరుకుంటారా..?. వెంటనే అరాచకానికి ప్లాన్ సిద్ధం చేశారు.  'చౌరీ చౌరా నేరం'గా ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని పేర్కొంటూ... పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఇందులో నిందితుల్ని గుర్తించడానికి బ్రిటిష్ పోలీసులు సింపుల్ పద్దతి ప్రయోగించారు. అదేమిటంచే గాంధీజి ప్రాంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు సమ్మతిస్తూ సంతకం చేసిన వారందర్నీ నిందితులుగా మార్చేశారు. ఆ తర్వాత గ్రామాల మీద దాడి చేశారు. అరాచాకం సృష్టించారు. 225 మంది పురుషులపై అభియోగాలు మోపారు. అందర్నీ అరెస్ట్ చేశారు జైళ్లలో పెట్టారు. వారిని కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. వారిలో 172 మందికి మరణశిక్ష విధించారు. పంతొమ్మిది మందిని ఉరిశిక్షనుఅమలు చేశారు. వారిని ఇప్పుడు చౌరీ చౌరా 'అమరవీరులు'గా స్మరించుకుంటున్నారు. 

చౌరీ చౌరాలో జరిగిన సంఘటనతో మహాత్మా గాంధీ కలత చెందారు. తన అహింసా సిద్ధాంతాన్ని దేశం అంగీకరించడానికి సిద్ధంగా లేదని..  తన నాయకత్వాన్ని అంగీకరించడానికి మరియు సూత్రప్రాయమైన అహింసా ప్రతిఘటనకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం లేదని బాధపడ్డారు. తన మార్గానికి కట్టుబడి ఉంటే ఒక సంవత్సరంలో స్వరాజ్యాన్ని దేశానికి తీసుకువస్తానని గాంధీ ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో గాంధీ 'సామూహిక శాసనోల్లంఘన' ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు.  కాంగ్రెస్ ఆ విషయంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బాధ్యతలను సర్దార్ పటేల్‌కు అప్పగించారు. 1922 ఫిబ్రవరి 8న  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు మహాత్మా గాంధీ ఒక రహస్య లేఖ రాశారు, 'గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగిన  హింసాత్మకంగా సంఘటనలోత ఆందోళనకు గురయ్యానని' వివరించారు. బర్డోలీ సత్యాగ్రహాన్ని నిలిపివేయాలని తాను ఆలోచిస్తున్నానని కూడా లేఖలో పేర్కొన్నారు. 'సగం హింసాత్మక సగం అహింసాత్మక ఉద్యమంలో వ్యక్తిగతంగా ఎప్పటికీ భాగం కాలేనని ..అది స్వరాజ్యం అని పిలవబడే సాధనకు దారితీసినప్పటికీ...తానూ స్వప్నించే నిజమైన స్వరాజ్యం కాదని లేఖలో గాంధీజీ పేర్కొన్నారు. 

చౌరీ చౌరా వద్ద జరిగిన ‘మూక’ హింస దేశం ఇంకా స్వరాజ్యానికి సిద్ధంగా లేదని చూపిందని గాంధీ అభిప్రాయపడ్డారని గాంధీ జీవిత చరిత్ర రచయిత, D. G. టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  చాలా మంది భారతీయుల అహింస అనేది బలహీనుల లక్షణం అనుకుంటారు.  కానీ దాదాపు పూర్తిగా నిరాయుధులైన ప్రజలలో అహింహను ఉపయోగించడం మంచిదని గాంధీ అభిప్రాయం.   అహింస అనేది ఇష్టానుసారం అవలంభించే లేదా వదిలివేయబడే విధానం కాదనేది గాంధీ అభిప్రాయం. ప్రపంచంలో నైతికంగా అవగాహన ఉన్న వ్యక్తలుగా ఉండేందుకు ఇది ఏకైక మార్గమని మహాత్ముడు చెబుతూ ఉంటారు. అహింసను ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేసిన వాలంటీర్లు హింసకు పాల్పడటం   భారతదేశం అహింసను స్వీకరించడానికి సిద్ధంగా లేదన్న అభిప్రాయాన్ని అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగింపుపై ప్రభావం చూపించింది. చౌరాచౌరీ ఘటన దేశ భవిష్యత్తుకు హాని కలిగిస్తుందనే స్పష్టమైన సత్యాన్ని గాంధీ గ్రహించారు.  తత్ఫలితంగా, ఉద్యమాన్ని నిలిపివేయడానికి ఫిబ్రవరి 11-12 తేదీలలో గుజరాత్‌లోని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునేలా చేయగలిగారు. అంతేకాకుండా, చౌరీ చౌరా వద్ద కానిస్టేబుళ్లను కిరాతకంగా హత్య చేసి, పోలీసు ఠాణాను ఇష్టానుసారంగా తగులబెట్టిన గుంపు అమానవీయ ప్రవర్తనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సామూహిక శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపేయాలని నిర్ణయించడం వల్ల అనేక రకాల విమర్శలు వస్తాయి.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుండి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మహాత్మ గాంధీ ఆదేశానుసారం అలా చేశారనడంలో సందేహం లేదు. మహాత్ముడు బయటకు ప్రచారం పొందిన దాని కంటే చిన్న స్థాయి వ్యక్తి అని అప్పటికప్పుడే చాలా మంది విమర్శలు చేశారు.  ఎందుకంటే గాంధీ ఎవరైనా తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే భరించలేరని ఏకపక్షంగా, ఆచార నిరంకుశత్వంతో వ్యవహరిస్తారని నిందించారు. ఇతర తీవ్రమైన ఆరోపణ ఏమిటంటే గాంధీ ధైర్యం లేకుండా వ్యవహరిస్తున్నారది. దేశం తన వెనుక ఉందని .. భారతదేశం స్వాతంత్ర్యం అందుకోవడానిక ిదగ్గరలో ఉందని..  బ్రిటిష్ పరిపాలన కొన్ని చోట్ల వాస్తవంగా స్తంభించిపోయిందని కూడా గాంధీకి తెలిసినా పేలవంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి.  " చౌరీ చౌరా సంఘటన తర్వాత మా ఉద్యమం ఆకస్మికంగా నిలిపివేయడం, గాంధీజీ కాకుండా దాదాపుగా ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరూ ఆగ్రహించారని నేను అనుకుంటున్నాను. దానికి మా నాన్న (అప్పట్లో జైల్లో ఉన్న) చాలా బాధపడ్డాడు. యువత సహజంగానే మరింత రెచ్చిపోయారు. ఆ నిర్ణయంతో అప్పటికి 15 ఏళ్ల వయస్సులో ఉన్న భగత్‌సింగ్‌ ఛిన్నాభిన్నమయ్యాడని కొన్నిసార్లు చెబుతారు. " అని జవహర్‌లాల్ నెహ్రూ  1941లో తన ఆత్మకథను రాస్తూ చౌరాచౌరీ ఘటన నాటిమానసిక స్థితిని గుర్తుచేసుకున్నారు 

వర్కింగ్‌ కమిటీ తీర్మానాలపై నెహ్రూకి గాంధీ మధ్య సంభాషణలు జరిగాయి.  మీరందరూ చాలా తీవ్రంగా విమర్శలకు గురవుతున్నారని తెలుసు.. నేను మీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను  కానీ మూకదాడులను సమర్థించడం అసంబద్ధం.  కొన్ని మారుమూల గ్రామాలలో ఉద్వేగభరితులైన యువకులు జాతీయ ఉద్యమం యొక్క ఫలితాన్ని అనుమతించారు. గాంధీ ఫిబ్రవరి 16న యంగ్ ఇండియా పత్రికలో  విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం సూటిగా సమాధానం ఇచ్చారు.ఇప్పటి వరకు వ్రాయబడిన అత్యంత అసాధారణమైన మానవ పత్రాలలో ఒకటి.' గాంధీ ఫిబ్రవరి 12న ఐదు రోజుల నిరాహార దీక్ష ఎందుకు ప్రారంభించారో..  ప్రాయశ్చిత్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అందులో చెప్పారు. ఇకపై గోరఖ్‌పూర్ జిల్లాలో హింస జరగకూడదని హెచ్చరించారు. 'చౌరీ  అణచివేత జరుగుతున్న ప్రదేశాలలో మానసికంగా లేదా శారీరకంగా హింస జరగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. చౌరాచౌరీ ఘటన ఓ మేల్కొలుపు అని గాంధీ అభివర్ణించారు. చౌరీ చౌరా విషాదం నిజంగా సూచిక.  

భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని పిలుపునివ్వడం ఘోరమైన తప్పిదమన ిచాలా మంది నమ్మకం. గాంధీ స్వంత కీర్తి కోసం ఇలా చేశారని అనుకున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాల తర్వాత గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం.. దేశద్రోహం,  ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచడం వంటి ఆరోపణలపై జైలుకు పంపించారు. విచారణలో దోషిగా తేల్చారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అందుకే ఆ తర్వాత కొన్నాళ్లు పాటు గాంధీజీ కూడా కొందరికి ప్రజల దృష్టిలో కనిపించకుండా పోయారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మరో ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుందని అప్పుడే అనుకున్నారు.  గాంధీ తన ఇష్టాన్ని కాంగ్రెస్‌పై విధించి, శాసనోల్లంఘన ఉద్యమాన్ని సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేయకుంటే 1947కి ముందే భారతదేశం స్వేచ్ఛగా ఉండేదని వాదించడం వాస్తవానికి విరుద్ధం. కానీ మరొక అభిప్రాయం సాధ్యమేనా?

( రచయిత : వినయ్ లాల్ , రైటర్,  బ్లాగర్, యూసీఎల్‌లో హిస్టరీ ప్రోపెసర్ )

[ డిస్‌క్లెయిమర్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు మరియు ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ABP న్యూస్ నెట్‌వర్క్ Pvt Ltd యొక్క అభిప్రాయాలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలను ప్రతిబింబించవు. ]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన బౌలర్ అశ్విన్ రవిచంద్రన్రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Embed widget