Dosa Challenge: ఈ దోశె మొత్తం తింటే రూ.71,000 క్యాష్ ప్రైజ్... తినడానికి మీరు సిద్ధమేనా?
ఫుడ్ ఛాలెంజ్‌లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండవుతున్నాయి. అలాంటిదే ఇది కూడా.
రెస్టారెంట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్‌లు విసరడం ప్రారంభించాయి. మొన్నటి వరకు బాహుబలి థాలి తింటే భారీ బహుమతులు అని విన్నాం. ఇప్పుడు చాలా రెస్టారెంట్లు ఇలాంటి సవాళ్లు విసురుతున్నాయి. కాకపోతే ఇలాంటి ఛాలెంజ్‌లలో భారీగా ఆహారం తినాల్సి ఉంటుంది. గతేడాది పుణెలోని ఒక రెస్టరెంట్ ‘విన్ ఎ బుల్లెట్ బైక్’ పేరుతో పోటీ పెట్టింది. పళ్లెంలో నాలుగు కిలోల మటన్, చేపలతో చేసిన వంటకాలను వడ్డించింది. ఆ వంటకాలన్నీ 60 నిమిషాలలో పూర్తి చేయాలి. గెలిచిన వారికి లక్షా 65వేల రూపాయలు విలువైన బైక్‌ను ప్రకటించింది. దాన్ని ఇంతవరకు ఎవరైనా గెలిచారో లేదో ఇంకా తెలియదు. ఇప్పుడు దిల్లీ రెస్టారెంట్ ఒకటి దోశె ఛాలెంజ్ ను విసురుతోంది.
తాము తయారుచేసే దోశెను తింటే రూ.71,000 నగదు బహుమతి అప్పటికప్పుడే ఇస్తామని దిల్లీలోని ఉత్తమ్ నగర్లోని స్వామి శక్తి సాగర్ అనే వ్యక్తి ప్రకటించారు. ఆయనకు ఓ రెస్టారెంట్ ఉంది. దోశె అనగానే మన ఇంట్లో వేసుకునే బుజ్జిబుజ్జి దోశెలు కాదు, ఆ దోశ ఏకంగా పదడుగుల పొడవు ఉంటుంది. అది సాదా ప్లెయిన్ దోశె కూడా కాదు, బంగాళాదుంప కుర్మా పైన బాగా పెట్టిన దోశె. ఎవరూ ఆ దోశెను తినే ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే తరువాత వచ్చే ఆరోగ్యసమస్యలు ఎవరు భరిస్తారని ఎక్కువమంది వెనకడుగు వేస్తున్నారు. దిల్లీ టమ్మీ అని పిలిచే ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ దోశెను వీడియోను షేర్ చేశాడు. దాన్ని ఏకంగా అయిదు లక్షల మంది వీక్షించారు.
View this post on Instagram
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ పరీక్ష తప్పక చేయించుకోవాల్సిందే...