News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

2050 నాటికల్లా 100 కోట్ల మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం జాగ్రత్త

ప్రపంచంలో వ్యాధుల బాధలు పెరిగిపోతున్నాయి.

FOLLOW US: 
Share:

2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మందికి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. లాన్సెట్ నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది రుమటాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 30 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో 15% మందికి ప్రస్తుతం ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. 2020లో 59 కోట్ల మంది ఆస్టియో ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది. అదే 1990లో కేవలం పాతిక కోట్ల మంది మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. 20 ఏళ్లలో అది 132 శాతం పెరిగింది. దీని ప్రకారం 2050 కల్లా 100 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఉన్నట్టు చెబుతోంది ఈ కొత్త నివేదిక.

వృద్ధాప్యం, ప్రపంచంలో జనాభా పెరగడం, ఊబకాయం వంటి పరిస్థితుల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ బారిన ఎక్కువ మంది పడుతున్నట్టు చెబుతున్నారు. పరిశోధకులు చెప్పిన ప్రకారం 1990లో ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ఊబకాయం 16% కారణంగా నిలిచింది. అదే 2020లో 20 శాతం మందిలో ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ఊబకాయమే కారణం. 

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పురుషులకంటే స్త్రీలపై అధికంగా దాడి చేస్తుంది. 2020లో 61 శాతం మంది మహిళలే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడ్డారు. ఇలా మహిళలకు ఈ వ్యాధి ఎక్కువగా రావడానికి హార్మోన్ల కారకాలు, శరీర నిర్మాణంలో తేడాలు, వారసత్వంగా రావడం వంటివి కారణం కావచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు. ఆస్టియో ఆర్థరైటిస్‌ను తరచుగా జాయింట్ డిసీజ్ అని అంటారు. ఇది కీళ్ళను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. కీళ్లలో ఉండే మృదులాస్తి విచ్ఛిన్నం కావడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మృదులాస్థి క్షీణించడం వల్ల ఎముకలు ఒకదానికొకటి తాకుతూ రుద్దుకుంటూ ఉంటాయి. దీనివల్ల కీళ్లు నొప్పి పెట్టడం, వాపు రావడం, కీళ్ల కదలికల్లో తగ్గుదల వంటివి జరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది హఠాత్తుగా రాదు. కాలక్రమేణా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇది రావడం సర్వసాధారణం.

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్ళను అయినా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా మోకాలు, తుంటి, వెన్నుముక వంటి బరువు మోసే కీళ్లలోనే ఇది వస్తుంది. చేతులు, వేళ్ళు లో ఉండే కీళ్ళను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం ఊబకాయం బారిన పడడం అడ్డుకుంటే ఆర్థరైటిస్ బారిన పడకుండా కూడా నిరోధించినట్టే. ఎవరైతే ఉబకాయాన్ని తగ్గించుకుంటారు వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 

Also read: మీ చెమట దుర్వాసన వస్తుందా? అయితే వీటిని తినడం తగ్గించండి

Also read: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనదిగా అధికారికంగా గుర్తింపు తెచ్చుకున్న ఆకుకూర ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 23 Aug 2023 08:06 AM (IST) Tags: Health Tips women Health Arthritis Disease

ఇవి కూడా చూడండి

Using Phone At Bathroom: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

Using Phone At Bathroom: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి

Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి

Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు