అన్వేషించండి

Raw Mangoes for Pickle : పచ్చడి కోసం మామిడి కాయలు కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ తప్పులు చేస్తే పచ్చడి పాడవుతుంది

Buying Mangoes for Pickle : ఆవకాయ సూపర్‌గా రావాలా? అయితే పచ్చడి మామిడి కాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఫాలో అయితే పచ్చడి ఎక్కువకాలం ఫ్రెష్గా నిల్వ ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పచ్చడి కోసం గట్టి, మచ్చలు లేని మామిడి కాయలు ఎంచుకోవాలి.
  • తురుము తక్కువ, గుజ్జు ఎక్కువ ఉండే కాయలు రుచిని పెంచుతాయి.
  • పులుపుగా, నీరు తక్కువగా ఉండే కాయలు పచ్చడికి మేలు.
  • ఒకే సైజు, ఒకే రకం కాయలు పచ్చడి రుచిని నిలబెడతాయి.

Tips to Choose Mangoes for Avakaya : వేసవికాలం వచ్చిందంటే చాలు.. దాదాపు ప్రతి ఇంట్లో మామిడి పచ్చడి పడతారు. ఆవకాయ, మాగాయి, పెసర ఆవకాయి అంటూ వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి పెట్టుకుంటారు. ఉగాది తర్వాత పచ్చడి మామిడి కాయల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఆవకాయ సీజన్‌లో మంచి నాణ్యమైన మామిడి కాయలు కొనడం చాలా ముఖ్యం. సరైన కాయలు తీసుకోకపోతే పచ్చడి రుచి, నిల్వ కాలం రెండూ ప్రభావితం అవుతాయి. కాబట్టి పచ్చడి మామిడి కాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మామిడి కాయలు కొనేప్పుడు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

గట్టి కాయలు 

పచ్చడి కోసం మామిడి కాయలు కొనాలనుకుంటే ముందుగా చెక్ చేసుకోవాల్సింది.. అది గట్టిగా ఉందో లేదో అని. కాయను చేతితో నొక్కితే మృదువుగా ఉంటే అది పండిపోయినట్లు అర్థం. గట్టిగా ఉంటే.. అది పచ్చడికి మంచిదని అర్థం చేసుకోవాలి. 

మచ్చలు, డాగులు లేనివి..

కాయపై నల్లని మచ్చలు, కోతలు, దెబ్బలు ఉంటే వాటిని తీసుకోకూడదు. అలాంటి మామిడి కాయలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి కాయ గట్టిగా ఉండడంతో పాటు.. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండేవి చూసుకోవాలి. 

తురుము తక్కువ బెటర్..

పచ్చడికి తురుము తక్కువగా ఉండే మామిడి రకాలు బెస్ట్. ఇవి కట్ చేసినప్పుడు సాఫ్ట్‌గా ఉండి రుచి బాగా ఇస్తాయి. అలాగే గింజ చిన్నగా ఉంటే గుజ్జు ఎక్కువగా ఉంటుంది. పచ్చడికి ఇలాంటివి మంచి ఎంపికగా చెప్పవచ్చు. 

పులుపు ఎక్కువగా ఉంటే..

పచ్చడి రుచి  బాగా రావాలంటే కాయ పులుపుగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి కాస్త పుల్లగా ఉండే కాయలు తీసుకోవాలి. కాయలను స్మెల్ చేస్తే.. పులుపు రుచి తెలుస్తుంది. అలాంటివి ఎంచుకుంటే బాగుంటుంది. చెడు వాసన వస్తే లేదా కాయ పాడైందని అనిపిస్తే పక్కన పెట్టేయండి.

నీళ్లు ఎక్కువగా ఉండే కాయలు..

నీరు చాలా ఎక్కువగా ఉండే మామిడి కాయలు పచ్చడిని త్వరగా పాడుచేస్తాయి. కాబట్టి మామిడి కాయను కట్ చేసినప్పుడు లోపల డ్రైగా ఉండేలాంటి కాయలు ఎంచుకోవాలి. అలాగే పాత కాయలు కొనకూడదు. లేదంటే అవి త్వరగా కుళ్లిపోతాయి. తాజాగా వచ్చినవే తీసుకోవాలి.

ఒకే సైజ్ కాయలు 

కాయల మధ్య పెద్ద తేడాలు లేకుండా.. మరీ పెద్దగా, చిన్నగా కాకుండా.. మిడిల్ సైజ్ కాయలు పచ్చడికి ఎంచుకోవాలి. మీడియం సైజ్ మామిడి కాయలు పచ్చడికి బెస్ట్. 

ఒకే రకం కాయలు 

వివిధ రకాల మామిడి కాయలు మిక్స్ చేస్తే పచ్చడి రుచి మారిపోతుంది. కాబట్టి ఒకే వేరైటీ తీసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది.

ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు మంచి మామిడికాయలు పచ్చడి కోసం కొనగోలు చేసుకోవచ్చు. అయితే కాయలు కొనుకున్న తర్వాత వెంటనే కట్ చేయకుండా.. ఒకరోజు గాలిలో ఉంచి.. తుడిచి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదా నీళ్లు లేకుండా మామిడికాయలను బాగా తుడిచి.. కట్ చేసి.. కాసేపు గాలికి ఆరనిస్తే.. పచ్చడిలో నీరు చేరకుండా ఉంటుంది. ఇది పచ్చడి ఎక్కవకాలం నిల్వ ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget