పచ్చి మామిడి కాయతో జ్యూస్.. టేస్టీ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

పుల్లగా ఉన్న పచ్చిమామిడి కాయలు తీసుకుంటే జ్యూస్ రుచిగా ఉంటుంది.

బాగా కడిగి తొక్కతోనే ముక్కలుగా కట్ చేయాలి లేదా ఉడికించేందుకు రెడీ చేసుకోవాలి.

ప్రెజర్ కుక్కర్‌లో లేదా పాత్రలో మామిడిని మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

చల్లారిన తర్వాత గుజ్జును తీసి టెంక, తొక్క వేరు చేయాలి.

ఇప్పుడు మామిడి గుజ్జులో నీరు కలిపి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి.

స్వీట్ కోసం బెల్లం లేదా చక్కెర వేసుకోవచ్చు. బెల్లం వేస్తే హెల్తీగా ఉంటుంది.

చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

ఫ్రిజ్‌లో చల్లబెట్టి లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

వేసవిలో వారానికి 2–3 సార్లు తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది.

ఎక్కువగా తాగితే అసిడిటీ రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ తీసుకోవాలి.