అన్వేషించండి

Halim Seeds : ఉదయాన్నే హలీమ్ సీడ్స్ తింటే కలిగే లాభాలు.. ఎలా తీసుకోవాలి? ఎవరెవరు జాగ్రత్తపడాలి?

Garden Cress Seeds : ఈ మధ్యకాలంలో చియా సీడ్స్ కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం ట్రెండ్ అవుతున్నాయి హలీమ్ సీడ్స్. వీటిని తింటే కలిగే లాభాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హలీమ్ గింజలు ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్లతో నిండిన అద్భుతమైన ఆహారం.
  • ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.
  • ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, గుండెను కాపాడతాయి.
  • నానబెట్టిన గింజలను ఉదయాన్నే తీసుకోవడం, మితంగా వాడటం మంచిది.

ఆకృతిలో చిన్నగా కనిపించే హలీమ్ సీడ్స్.. ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన పోషకాలు అందిస్తాయి. అందుకే వీటిని సోషల్ మీడియాలో ఇన్​ఫ్లూయెన్సర్స్​ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ట్రెండ్ అవుతున్న టాపిక్​ కాబట్టి.. చాలామందిలో ఈ హాలీమ్ సీడ్స్​ గురించిన క్యూరియాసిటీ పెరిగింది. నిజంగా ఇవి ఆరోగ్యానికి మంచివా? లేక ట్రెండ్ కోసం వీడియోలు చేస్తున్నారా? అనే డైలామాలో ఉన్నారు. కానీ ఇవి నిజానికి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే వీటిని తీసుకుంటే మంచిదని.. ముఖ్యంగా ఉదయాన్నే తీసుకుంటే మరింత లాభమని అంటున్నారు. ఇవి ఎంతవరకు నిజమంటే..

హలీమ్ సీడ్స్ బెనిఫిట్స్

హలీమ్ సీడ్స్ తింటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండే ఈ సీడ్స్.. అనీమియా ఉన్నవారికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండి మలబద్ధకం తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.  ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి.. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. కాల్షియం బోన్ హెల్త్​ని మెరుగు చేస్తుంది. గ్లూకోజ్ అబ్జార్ప్షన్‌ను స్లో చేసి.. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మహిళల హార్మోనల్ సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గించి.. బలాన్ని అందిస్తాయి. ఉదయాన్నే తింటే రోజంతా యాక్టివ్​గా ఉంటారు. 

ఎలా తీసుకుంటే మంచిది?

హలీమ్ సీడ్స్ నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. రాత్రుళ్లు పడుకునే ముందు.. 1 టీ స్పూన్ హలీమ్ సీడ్స్​ను నీటిలో నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. వీటిని పాలు లేదా మజ్జిగలో కూడా కలిపి తీసుకోవచ్చు. లడ్డూల రూపంలో లేదా డ్రింక్​గా కూడా తీసుకోవచ్చు.

రోజుకు ఎంత తీసుకోవచ్చు?

రోజులో హలీమ్ సీడ్స్ 1 లేదా 2 టీ స్పూన్లు తీసుకుంటే చాలు. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. నీటిలో నానబెట్టకుండా తీసుకోవడం కూడా మంచిది కాదు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనిలో బీపీని తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి బీపీ తక్కువగా ఉన్నవారు తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షుగర్ లెవల్స్ చాలా తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఎవరెవరు తీసుకోకూడదంటే.. 

హలీమ్ సీడ్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. గర్భిణీలు అధికంగా తీసుకోకూడదు.  చిన్నపిల్లలకి ఇవ్వాలనుకుంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు, కొన్ని రకాల మందులు తీసుకునేవారు వైద్యుల సూచనలతో మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మీరు కూడా నిపుణుల సలహాలు తీసుకుని.. ఈ చిన్ని సీడ్స్​ని మీ డైట్​లో యాడ్ చేసుకుని లాగించేయవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget