అన్వేషించండి

Butter Milk: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ, కొవ్వు కరుగుతుంది తేలిగ్గా - ఇంకా చాలా లాభాలున్నాయ్!

వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది.

వేసవిలో చల్లగా, రిఫ్రెష్ గా అనిపించడంలో కోసం కూల్ డ్రింక్స్, కోలా, సోడాలు తాగుతారు. కానీ వాటి కంటే ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు బోలెడు ఉన్నాయి. అదే మజ్జిగ లేదా చాస్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఈ పానీయం ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి మేలు చేస్తుంది. పెరుగు నుంచి వచ్చే మజ్జిగ చాలా రుచిగా ఉంటాయి. వాటిని మరింత రుచిగా మార్చుకునేందుకు అందులో కొద్దిగా నిమ్మకాయ రసం, కాస్త కొత్తిమీర వేసుకుని తాగితే వడదెబ్బ నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ నిండి ఉంటుంది. మజ్జిగలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. కండరాలు బలోపేతం చేయడం, మెరిసే చర్మాన్ని ఇచ్చేందుకు, బలమైన ఎముకల్ని నిర్మించడంలో మజ్జిగ సహాయపడుతుంది.

ఒక గ్లాసు మజ్జిగలో ప్రోబయోటిక్స్, విటమిన్ ఏ, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మండే ఎండ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. మజ్జిగ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

శక్తిని ఇస్తుంది

మజ్జిగలో రిబోఫ్లోవిన్ ని అందించే విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని అమైనో ఆమ్లాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కడుపులో మంటని తగ్గిస్తుంది.

పాలకు ప్రత్యామ్నాయం

మజ్జిగ పాలకు సరైన ప్రత్యామ్నాయం. ఇది జీర్ణం కావడం కూడా చాలా సులభం. మజ్జిగ తయారీ ప్రక్రియలో పాలలోని లాక్టోస్ విచ్చిన్నం చేసి జీర్ణం చేసే బ్యాక్టీరియాను జోడించి దాన్ని లాక్టిక్ యాసిడ్ గా మారుస్తుంది. అందువల్ల లాక్టోస్ మొత్తం తగ్గుతుంది.  

పేగులకు మంచిది

శరీరంలోని అవయవాలను సజావుగా పని చేసేందుకు పేగులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మజ్జిగలో పేగుల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వేగంగా, సాఫీగా జీర్ణం అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది.

ఎముకలకు బలం

మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. అందుకే తరచూ మజ్జిగ తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. కాల్షియం శరీర ఎముక నిర్మాణాలకు మాత్రమే కాదు.. రక్తంలో సిగ్నలింగ్ వ్యవస్థలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తుంది.

కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది

మజ్జిగ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో 0.5 గ్రాముల సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది. హైపర్ కొలేస్టెరోలేమియా సమస్య ఉన్నవాళ్ళు మజ్జిగ తాగితే మంచిది. బరువు తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం MFGM లిపిడ్లు కొలెస్ట్రాల్, వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. MFGM లిపిడ్‌లను మిల్క్ ఫాస్ఫోలిపిడ్‌లు అని కూడా అంటారు.

ఎసిడిటీ తగ్గిస్తుంది

ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల తరచుగా పొట్టలో యాసిడ్ రిఫ్లక్స్ కు దారి తీస్తుంది. గుండెల్లో మంట, తీవ్రమైన అజీర్ణానికి కారణమవుతుంది. గ్లాసు మజ్జిగలో నల్ల మిరియాలు, కొత్తిమీర కలిపి తీసుకుంటే ఎసిడిటీ లక్షణాలు తక్షణమే తగ్గించుకోవచ్చు. మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ పొట్టలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి.

మజ్జిగలో పుదీనా, కొత్తిమీర, నల్ల ఉప్పు, అల్లం, మిరియాలు వేసుకుని చేసుకుని తాగితే రుచిగా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: హోలీ రంగుల నుంచి మీ జుట్టుని ఇలా సంరక్షించుకోండి

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget