By: ABP Desam | Updated at : 07 Mar 2022 05:19 PM (IST)
(Image credit: Pixabay)
దోశె ఎంతో మంది ఫేవరేట్ అల్పాహారం. మసాలాదోశె, ప్లెయిన్ దోశె, ఆనియన్ దోశె... ఎప్పడూ ఇవేనా. ఓసారి సొరకాయ దోశె చేసుకుని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చేయడం కూడా ఎంతో సులువు. ముఖ్యంగా పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో పెట్టేందుకు ఇది సరైన ఎంపిక.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
సొనకాయల తరుగు - ఒక కప్పు
అల్లం - చిన్న ముక్క
ఎండు మిర్చి - ఆరు
జీలకర్ర - రెండు స్పూన్లు
నీళ్లు - సరిపడినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కాల్చడానికి సరిపడా
తయారీ
1. బియ్యాన్ని కడిగి మూడు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
2. ఎండు మిర్చి, జీలకర్ర ఓసారి వేయించుకోవాలి.
3. మిక్సీలో నానబెట్టిన బియ్యం, సొరకాయ తరుగు, అల్లం ముక్క, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి మెత్తగా రుబుకోవాలి.
4. దోశెల పిండి జారుడు తనం వచ్చేంత వరకు రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
5. మీకు కావాలనుకుంటే అందులో కాస్త పసుపు కలుపుకోవచ్చు. ఇష్టం లేకపోతే వదిలేయచ్చు.
6. ఆ రుబ్బుతో పలుచటి దోశెలు వేసుకుని కొబ్బరి చట్నీ లేదా, టమాటో చట్నీతో తింటే టేస్టు అదిరిపోతుంది.
సొరకాయతో ఎన్ని లాభాలో...
1. సొరకాయతో లభించే కేలరీలు చాలా తక్కువ.కాబట్టి అధిక బరువు కలవారు కూడా ఈ దోశెలను హ్యాపీగా తినొచ్చు.
2. సొరకాయలో విటమిన్ బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరరోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. మధుమేహం ఉన్నవారికి కూడా సొరకాయ చాలా మేలు చేస్తుంది. కాబట్టి సొరకాయ దోశెలు చేసుకుని తింటే మంచిదే. కాకపోతే ఇందులో బియ్యం వాడతాం కాబట్టి, రెండు దోశెలు కన్నా ఎక్కువ తినకపోవడమే ఉత్తమం. అయితే బియ్యం బదులు బ్రౌన్ రైస్ వాడితే డయాబెటిక్ వారికి మంచిది.
4. సొరకాయ వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.
5. సొరకాయ రసం తరచూ తాగడం వల్ల రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.
6. ఈ కూరగాయ రక్తపోటును అదుపులో ఉంచుతుంది కనుక గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
7. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, దీన్ని ఏదో ఒక రూపంలో తినడం ఉత్తమం. మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది.
8. మూత్రాశయ ఇన్ఫెక్షన్ తో బాధ పడేవారికి సొరకాయ మేలు చేస్తుంది. దీన్ని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యకరమే.
9. దీనిలో 92 శాతంవ నీరే ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణం అవుతుంది.
Also read: సెలెబ్రిటీల ఫేవరేట్ వర్కవుట్ ఇది, బాడీ షేప్ అందంగా మార్చేస్తుంది
BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...
Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే
Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది
Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!