By: ABP Desam | Updated at : 07 Mar 2022 04:43 PM (IST)
Edited By: harithac
(Image credit: victoremgear.com)
అందానికి, ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. కనిపించకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఫిట్‌నెస్ సాధించాలంటే వర్కవుట్లపై ఆధారపడతారు చాలా మంది. యోగా బాట పట్టే వాళ్లు కూడా అధికమే.ఇప్పుడ జిమ్ లో సెలెబ్రిటీలో హాట్ వర్కవుట్ ఏదో తెలుసా? ‘బ్యాటిల్ రోప్ వర్కవుట్’. రెండు తాళ్లను పట్టుకుని ఆగకుండా ఊపడమే ఆ వర్కవుట్. సమంత నుంచి దీపికా పడుకునే వరకు ఎంతో మంది తారలు రోజూ ఈ వర్కవుట్‌ను చేస్తుంటారు. దీనికి వాడే తాడు సన్నగా ఉండదు, లావుగా ఉంటుంది. చేత్తో పట్టుకోవడానికి కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆ తాళ్లను పట్టుకుని ఊపడం కష్టమే. చెమటలు పట్టడమే కాదు, కొవ్వు కరిగిపోతుంది. అందుకు బరువు తగ్గేందుకు ఈ వర్కవుట్ బెస్ట్ అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
ఈ తాళ్లు వివిధ రకాల మందం, పొడవులతో లభిస్తాయి. తాడు వెడల్పు ఆధారంగా దీని బరువును నిర్ణయిస్తారు. తాడును ఎత్తి కుదిపేందుకు చాలా బలం, శక్తి అవసరం అవుతుంది. మధుమేహం ఉన్నవారు మొదట్లో 1 నుంచి 1.5 అంగుళాల తాడును ఉపయోగించవచ్చు. ఆ తరువాత మెల్లగా రెండు లేదా రెండున్న అంగుళాల తాడుకు మారొచ్చు.
ఈ తాడు వర్కవుట్ చేసేందుకు స్క్వాట్ పొజిషన్లో నిల్చోవాలి. మోకాళ్లు కొద్దిగా కిందకి వంచి చాతీ నిటారుగా ఉంచాలి. తాడును భూమి నుంచి ఎంత పైకి ఎత్తి ఆడిస్తే అంత శక్తి, కెలోరీలు ఖర్చవుతాయి. ఇలా చేయడం శరీరం మంచి షేప్ కి వస్తుందని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.
[/insta]
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Headphones side effects: హెడ్ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!
Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Clay Pot: ఫ్రిజ్లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్