అన్వేషించండి

Boddemma 2024 : బొడ్డెమ్మను ఎందుకు చేసుకుంటారో తెలుసా? బతుకమ్మకు ముందు వచ్చే పండుగ విశేషాలు ఇవే

Telangana Boddemma Celebrations 2024 : తెలంగాణలో రీజనల్​గా చేసే పండుగలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో బొడ్డెమ్మ ఒకటి. అసలు బొడ్డెమ్మ అంటే ఏంటి దీనిని ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. 

Boddemma Celebrations 2024 : తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటివాటిలో బొడ్డెమ్మ ఒకటి. బోనాలు, బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో.. బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధన్యత ఉంది. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొట్టె, బొడ్డె అంటే చిన్న అని. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి, పూలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఆదివారం నుంచి బొడ్డెమ్మను చేస్తున్నారు. 

భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు. ఈ మట్టి పూల పండుగను బాలికలు చేసుకుంటారు. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు.

కొందరు నోము కూడా చేస్తారు

బొడ్డెమ్మను కాలనీలో లేదా గల్లిలో ఆనవాయితీగా చేసే చోట మాత్రమే బొడ్డెమ్మను (వేస్తారు) రూపొందిస్తారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డెమ్మ ఆటపాటల్లో పాల్గొంటారు. కొన్ని కుటుంబాల్లో దీనిని ఒక నోముగా చేసుకుంటారు. బాలికలకు మూడు లేదా 5వ ఏట నుంచి.. ప్రారంభించి ఈ నోమును యుక్తవయసు వచ్చేవరకు చేస్తారు. అమ్మాయికి పెళ్లి కావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోము ఇది. 

బొడ్డెమ్మను ఎలా చేస్తారంటే.. 

బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తారు. ఆపైన ఒక చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. ప్రతి రోజు అనగా తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు చేస్తారు. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు. 

సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి వస్తారనే విశ్వాసంతో ఈ ఆట ఆడతారు. పూజలో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి.. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. అవి ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ... నిద్రపోమ్మా. నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు.

పేర్లు వేరైనా.. అమ్మ ఒక్కతే.. 

బొడ్డెమ్మను.. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి వేస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరిరోజు.. బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి.. పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజించి.. పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో పోయిరా బొడ్డెమ్మ.. అంటూ నిమజ్జనం పూర్తి చేస్తారు. 

మరుసటి రోజు నుంచే బతుకమ్మ..

బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. దానిని కూడా తొమ్మిదిరోజులు చేస్తారు. ఇది ముగిసే సరికి దసరా వస్తుంది. ఇలా దాదాపు ఇరవై రోజులకు పైగా పండుగ వాతావరణం ఉంటుంది. ఆడవారు ఈ మూడు పండుగల్లో గౌరి దేవిని కామన్​గా పూజిస్తారు. కానీ వివిధ పేర్లతో కొలుచుకుంటారంతే..

Also Read : బతుకమ్మని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget