Lobia: బరువు, థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే ఈ బీన్స్ తినాల్సిందే
అధిక బరువు, థైరాయిడ్ రెండూ పెద్ద సమస్యలే. వీటిని తగ్గించుకోవాలంటే అది ఆహారం వల్ల సాధ్యమవుతుంది.
బరువు తగ్గే విషయంలో చేయాల్సినవి చేయకూడనివి చాలా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతకి బాధ్యత వహించే థైరాయిడ్ వంటి శరీరంలోని జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అటు బరువు తగ్గడానికి, ఇటు థైరాయిస్ సమస్యని నిరోధించేందుకు లోబియా లేదా బ్లాక్ ఐ బీన్స్ చక్కగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్లగా ఉండే ఈ బీన్స్ మధ్యలో మాత్రం నల్ల కన్ను మాదిరిగా ఉంటుంది. లోబియా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. తక్కువ కేలరీల ఆహారం. ఫోలేట్, ప్రోటీన్, ఐరన్ వంటి అనేక పోషకాలని అందిస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం 100 గ్రాముల బరువు తగ్గడానికి సహాయపడే 44 శాతం ఫైబర్ ని ఇవి అందిస్తాయి. ఈ ఫైబర్ శరీరం నుంచి టాక్సిన్స్, పేరుకుపోయిన కొవ్వు, సెల్యులైట్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది.
థైరాయిడ్ తగ్గిస్తుందా?
లోబియా థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పోషకార నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని సూపర్ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాంప్లెకశ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు అనేక శారీరక విధులను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటి పనితీరులో అసమతుల్యత ఏర్పడితే అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం, మానసిక కల్లోలం, మలబద్ధకం వంటి లక్షణాలు ఎదురువుతాయి. థైరాయిడ్ పనితీరు సరిగా ఉండేలా చేయడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో ఈ లోబియా మొదట ఉంటుంది. ఈ బీన్స్ ఆహారంలో నిరంతరం చేర్చడం వల్ల జింక్ హార్మోన్ సమతుల్యతకు సహాయపడుతుంది.
లోబియా వంటి చిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. థైరాయిడ్ గ్రంథి అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలతో నియంత్రించబడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే లోబియా వంటి నిర్ధిష్ట ఆహారాలు ఒక్కటే థైరాయిడ్ రుగ్మతలని నియంత్రించలేవు. పప్పు ధాన్యాలతో సహా వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇది థైరాయిడ్ ఆరోగ్యమే కాదు మొత్తం ఆరోగ్యానికి దోహదపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
బ్లాక్ ఐ బీన్స్ లో విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి 6, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, జింక్ వంటి ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షించగలవు. ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తాయి. చర్మానికి చాలా మేలు చేస్తాయి. జుట్టు రాలకుండా నిరోధించి వెంట్రుకలు పెరిగేందుకు దోహదపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: చర్మాన్ని మెరిపించే కూరగాయలు, పండ్లు ఇవే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial