BiggBoss Naga Manikanta Trolls : బిగ్‌బాస్ మణికంఠది ఒరిజినల్ జుట్టు కాదా? విగ్నా? వైరల్ అవుతోన్న వీడియో.. ట్రోల్స్ చేస్తున్న సోషల్ మీడియా.. చూసేదంతా నిజంకాదు బ్రదర్
Naga Manikanta Wig Video : నిన్న జరిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్లో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. అదే బాధలో తలపై ఉన్న విగ్ తీసేశాడు. ఆ తర్వాత ఏమైందంటే..
Bigg Boss Troll Videos : నామినేషన్స్ సమయంలో నాగమణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్, సీత అతనికి సర్ది చెప్తున్న సమయంలో నాగమణికంఠ ఎమోషనల్ అవుతూ.. తలపై ఉన్న విగ్ తీసేశాడు. ఏమి చేస్తున్నాడో అర్థం కాక.. నిఖిల్ అలానే నిర్ఘాంతపోయి చూశాడు. ఈ ఫుటేజ్ చూసిన బిగ్‌బాస్ ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మణికంఠను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కేవలం మణికంఠ వరకేనా? ఇంకా ఉన్నారా?
షాక్‌లోనే ఉన్న నిఖిల్
మూడు.. నాలుగు రోజులుగా వారితో కలిసి ఉన్న మణికంఠది విగ్ అని హౌజ్‌లో ఉన్నవారే గుర్తించలేకపోయారు. పైగా అతను సోషల్ మీడియాలో ఎన్నో రీల్స్ చేస్తూ.. ఉంటారు. సోషల్ మీడియాలో అతడిని ఫాలో అయ్యే చాలామందికి కూడా ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. తఅందుకే చూసేవన్నీ నిజాలు కాదని చెప్తున్నారు నిపుణులు. కానీ కొందరు యూత్ ఇలాంటి ఇన్ఫ్లూయెన్సర్స్ని చూసి.. తామెందుకు ఇలా లేమని డిప్రెషనలోకి వెళ్తారు. అంతెందుకు రీసెంట్గా ఓ కాస్మోటిక్ సర్జన్ బిగ్‌బాస్‌కి వచ్చే వారిలో ప్రతి సీజన్లో తన క్లయింట్సే ముగ్గురు, నలుగురు ఉంటారని తెలిపాడు.
View this post on Instagram
ప్రతీ సీజన్లోనూ ఉన్నారు..
తెలుగు బిగ్‌బాస్‌కి వచ్చే వారు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుని వస్తారని.. ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ రాజశేఖర్ గొల్లు తెలిపారు. హైదరాబాద్‌లో అతి పెద్ద కాస్మోటాలజిస్ట్ అయిన రాజశేఖర్.. తెలుగులో బిగ్‌బాస్‌లో ప్రతి సీజన్లో ముగ్గురు, నలుగురు తన క్లైంట్సే ఉంటారని చెప్పాడు. తమ షేప్స్, ముక్కు, పెదాలకు బొటెక్స్, బ్రెస్ట్ ఫిల్లర్స్ ఇలా ఎన్నో రకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని.. బిగ్‌బాస్‌కు వస్తున్నారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
చూసేదంతా నిజం కాదు..
సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదు. ముఖ్యంగా కొందరు ఇన్ఫ్లూయెన్సర్స్ని, సెలబ్రెటీలను చూసి.. వారిలా ఉండాలి అనుకుంటారు కానీ.. వారు కేవలం కెమెరా ముందు నటించేందుకు.. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారే తప్పా.. సొంత మొహలు.. సొంత క్యారెక్టర్స్ కాదనే విషయం కొందరు అర్థం చేసుకోరు. అలాంటి వారికి బిగ్‌బాస్‌నే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. తాజాగా మణికంఠ విగ్ విషయం వల్ల ఈ టాపిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
కేవలం సోషల్ మీడియానే కాదు..
సినిమాల్లో కూడా హీరోయిన్స్, హీరోలు అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. తెర మీదకు వచ్చే ముందు మాత్రం వాటిని కవర్ చేసుకుంటారు. ఈ విషయం తెలియక ఎంతో మంది తమ సమస్యలను ఇన్‌సెక్యూర్‌గా తీసుకుని మానసికంగా డిస్టర్బ్ అవుతారు. అలాగే అప్పీరియన్స్‌లో మార్పులు ఉన్నవారిని చూసి హేళన చేసే వారు కూడా ఎక్కువైపోతున్నారు. అందంగా కనిపించకుంటే లైక్స్ రావని.. ఫాలోవర్స్ ఉండరని ఇవన్నీ మెయింటైన్ చేస్తారు.త కాబట్టి తెరపై కనిపించే అందాన్ని కాదు.. మనసు మంచిగా ఉండేలా చూసుకుంటే.. ఎన్ని లోపాలున్నా పైకి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారని చెప్తున్నారు నిపుణులు.
ఓవర్ కామ్ చేయండి..
కొందరు రంగు తక్కువగా ఉన్నారనో.. మరికొందరు లావుగా ఉన్నారనో.. ఇంకొందరు పొట్టిగా ఉన్నారనో.. జుట్టు లేదనో.. ఇలా వివిధ కారణాల వల్ల చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. అలాంటివారు సోషల్ మీడియాను చూసి.. సెల్ఫ్ జడ్జిమెంట్స్ చేసుకోకపోవడం మంచిది. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మన డిఫెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ.. ముందుకు ఎలా వెళ్లాలో తెలిస్తే మీకన్నా అందంగా మరెవరు ఉండరు. తెలిసో తెలియకో.. పబ్లిక్ స్టంట్ కోసమో.. ఆ విషయాన్ని మణికంఠ ఓవర్కామ్ చేసేశాడు. మీరు కూడా అలాగే మీ డిఫెక్ట్స్ని ఓవర్ కామ్ చేయండి.