అన్వేషించండి

BiggBossTelugu 8 Day 4 Promo : తనని తానే ఆడపులిగా డిక్లేర్ చేసుకున్న సోనియా, ఫేష్ వాష్​తో బ్రష్ చేసుకున్న పృథ్వీరాజ్.. న్యూ టాస్క్​తో 3 టీమ్స్​గా విడిపోయిన కంటెస్టెంట్లు

BiggBossTelugu New Promo : బిగ్​బాస్​లో కంటెస్టెంట్లను టీమ్స్​గా విడిపోయారు. న్యూ టాస్క్ పేరుతో వారిని విడదీశారు బిగ్​బాస్. ఇంతకీ ఎవరి టీమ్​లో ఎవరున్నారంటే..

New Task in Biggboss 8 : బిగ్​బాస్​లో నామినేషన్స్​ లొల్లి ముగిసింది. కంటెస్టెంట్లు నార్మల్​గా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నాడేమో కానీ.. బిగ్​బాస్ వెంటనే న్యూ టాస్క్​తో వచ్చేశాడు. హోరా హోరీన జరిగిన నామినేషన్స్​లో బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ ఈ వారం లిస్ట్​లో ఉన్నారు. వారికి హోజ్​లో ఉండే సత్తా ఉందని నిరూపించుకునేందుకు ఈ టాస్క్​ పనికొస్తుంది. ఇంతకీ బిగ్​బాస్ ఇచ్చిన టాస్క్​ ఏంటి? ప్రోమోలో ఏమి చూపించారంటే..

ఎవర్రా మీరంతా..

ప్రోమో స్టార్టింగ్​లో కామెడి ట్రాక్ పెట్టారు. పృథ్వీరాజ్ సీరియస్​గా బ్రష్​కి ఫేస్ వాష్​ పెట్టుకుని బ్రష్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో అక్కడున్న నిఖిల్ నువ్వు ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నావా అని అడిగితే అవును అని పృథ్వీ చెప్తాడు. అది టూత్ పేస్ట్ కాదు.. ఫేస్ వాష్ అనగానే అందరూ నవ్వేస్తారు. అప్పటివరకు పృథ్వీ కూడా ఈ విషయం రియలైజ్ అవ్వడు. మిగిలిన హోజ్ మెంబర్స్​ అంతా రోజూ ఇలానే బ్రష్ చేసుకుంటున్నావా అంటూ పృథ్వీని టీజ్​ చేశారు. నిఖిల్ కూడా ఎవర్రా మీరంతా అనడంతో అందరూ నవ్వుతూ సెటైర్స్ వేసి పృథ్వీని టీజ్ చేశారు. 

న్యూ టాస్క్​.. 

సైన్యం లేని రాజు.. రాజు కాలేడు అంటూ బిగ్​బాస్​ చెప్తూ.. కొత్త టాస్క్​ గురించి వివరించాడు. చీఫ్ పవర్​ఫుల్​ అవ్వడానికి చీఫ్​కి ఒక క్లాన్​ కావాలి. ఛీప్స్​ వారి క్లాన్స్​ని నిర్మించుకోవడానికి సమయం ఆసన్నమైంది. అంటూ యాశ్మీ, నిఖిల్, నైనికను ఉద్దేశించి బిగ్​బాస్ చెప్పాడు. ఈ టాస్క్​ కోసం నామినేషన్స్ సమయంలో ఇచ్చిన గొలుసులను వారు వేసుకున్నారు. ఛీప్స్ వారి టీమ్స్​ను రెడీ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది అంటూ.. కంటెస్టెంట్లను మూడు టీమ్స్​గా విడగొట్టేందుకు బిగ్​బాస్ ప్రయత్నించాడు. 

స్ట్రేటజీలు ఇవే..

ఈ సమయంలో యాశ్మీ, నిఖిల్, నైనిక.. తమకి ఏ కంటెస్టెంట్ కావాలో వారిని తమ టీమ్​లోకి తీసుకునేందుకు చూస్తున్నారు. తమ తమ రీజన్స్ చెప్పి క్లాన్స్​ని బిల్డ్ చేసుకోవడానికి యత్నిస్తున్నారు. యాశ్మీ.. మణికంఠతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో నా క్లాన్స్ గెలవాలి అంటూ మోటివేట్ చేస్తుంది. నిఖిల్ కూడా విష్ణుప్రియతో మాట్లాడుతూ.. నా టీమ్ తప్పు చేసినా.. అక్కడే డిఫెండ్ చేసుకుని.. తర్వాత సాల్వ్ చేసుకోవాలంటూ తన స్ట్రేటజీ చెప్తూ కనిపించాడు. 

తప్పు చేస్తే మాట్లాడేయండి..

నైనిక కూడా మణికంఠతో మాట్లాడుతూ.. అనవసరమైన గొడవలు కూడా వద్దు అంటూ తేల్చచి చెప్పింది. పాయింట్ నచ్చకపోయినా.. తప్పు చేసినా.. ట్రిగర్ అయినా మాట్లాడండి. అది ఏదైనా సరే అంటూ మణికంఠకి తెలిపింది. అనంతరం తమకు కావాల్సిన కంటెస్టెంట్లు టీమ్​లోకి వస్తున్నారా లేదా అనేది ప్రోమోలో చూపించారు. 

స్ట్రెంత్, మైండ్ నా దగ్గరుంది..

నా క్లాన్​కు తన అవసరముందని నేను ఫీల్​ అవుతున్నాను. అన్ని రకాలుగా తను నాతో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంటూ తెలిపింది. అయితే ప్రోమోలో విష్ణుప్రియను, ప్రేరణను బిగ్​బాస్ చూపించారు. నాకు స్ట్రెంత్ దొరికింది, మైండ్ దొరికింది. నేను ఎంటర్​టైన్​మెంట్​ నుంచి వచ్చాను కాబట్టి ఐ వాంట్​ మై ఎంటర్​టైన్​మెంట్ అంటూ చెప్పింది నైనిక. ఆ సమయంలో ఆదిత్య ఓంని చూపించారు ప్రోమోలు. 

ఆడపులిగా డిక్లేర్ చేసుకున్న సోనియా

స్మార్ట్​నెస్, ఇంటిలిజెన్స్​.. చాలా అబ్జర్వ్ చేస్తారు. పాయింట్ అవుట్ కూడా చేస్తారు అంటూ నిఖిల్ చెప్పాడు. నవీన్ మాట్లాడుతూ నన్ను నేను కొంచెం స్ట్రెచ్​ చేసుకుందామనే ఈ హౌజ్​లోకి వచ్చాను కాబట్టి ఐ యామ్ చూజింగ్ హర్ అంటూ నైనికను చూపించారు. సోనియా మాట్లాడుతూ.. ట్రూ కలర్​ ఆఫ్ హిమ్.. మనుషులను గెలుచుకుంటున్నాడో లేదో చూడాలి. ఈ ఆడ పులితో ఫైట్ చేస్తేనే.. పవర్​ ఫుల్ అయితాది అంటూ నిఖిల్​ని చూపించింది. 

టీమ్స్ ఇవే..

ప్రోమో ముగిసే సరికి నిఖిల్ దగ్గర మణికంట, బేబక్క, సోనియా ఉండగా.. ప్రోమోలో యశ్మీ దగ్గర శేఖర్ బాష, పృథ్వీరాజ్, నవీన్, ప్రేరణ ఉన్నారు. నైనిక దగ్గర విష్ణుప్రియ, ఆదిత్య ఓం, సీత, నఫ్రీద్ ఉన్నారు. 

Also Read : బిగ్​బాస్​ నామినేషన్స్​​లో గుడ్డు పంచాయతీ.. అమ్మ సెంటిమెంట్​తో ఏడిపించేసిన మణికంఠ.. ఏదోలోకంలో ఉన్న ఆదిత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget