అన్వేషించండి

BiggBoss Telugu 8 Day 3 Promo : బిగ్​బాస్​ నామినేషన్స్​​లో గుడ్డు పంచాయతీ.. అమ్మ సెంటిమెంట్​తో ఏడిపించేసిన మణికంఠ.. ఏదోలోకంలో ఉన్న ఆదిత్య

BiggBoss Telugu 8 : బిగ్​బాస్​ నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న కంటెస్టెంట్​లతో ఫుల్​ కోపంతో మాట్లాడిన మణికంఠ ఈరోజు అందరినీ ఎమోషనల్ చేశాడు.

Bigg Boss Telugu 8 Heated Nominations Promo : బిగ్​బాస్​ హౌజ్​లో నామినేషన్స్​ నిన్న కొట్టుకునే రేంజ్​లో జరిగితే.. ఈరోజు ఎపిసోడ్​లో మాత్రం ఎమోషనల్​గా మారాయి. ముఖ్యంగా నాగమణికంఠ నిన్న ఓ రేంజ్​లో సీరియసై.. ఈరోజు మాత్రం ఏడుస్తూ.. అందరినీ ఏడిపించేశాడు. ఇంతకీ హౌజ్​లో ఇంకెవరి నామినేషన్స్ మిగిలాయి. ఏ రీజన్ మీద ఎవరు నామినేట్ చేశారు. బిగ్​బాస్​ హౌజ్​లో డే 3 ప్రోమోలో ఏముంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గుడ్డు పంచాయతీ.. 

కిరాక్ సీత.. బేబక్కను నామినేట్ చేసింది. వీరి మధ్య కిచెన్ లొల్లి మొదలైంది. ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అనుకున్నాము అంతే.. కానీ నిన్న రాత్రి మీరు రెండు కూరలు చేశారంటూ సీత తెలిపింది. రెండు కూరలు చేయలేదు అంటూ బదులిచ్చిన బేబక్కకి.. రెండు కూరలు చేశారు.. ఒకటి చికెన్ ఒకటి ఆలూ అంటూ రిప్లై ఇచ్చింది సీత. దీంతో బేబక్క వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్లు నాన్​వెజ్ తినరు అంటూ తెలిపింది. ఒకటే గుడ్డు.. నాది అది దానితో నేను బుర్జి చేసుకుంటాను అంటే మీరు ఎందుకు నో అన్నారని సీత ప్రశ్నించింది. 

రెస్పాన్స్​బులిటీ తీసుకుని.. పవర్​ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోవియల్​గా, జోకులేసుకుని చిల్​ కొట్టు అంటూ విష్ణుప్రియను ఉద్దేశించి చెప్పింది సోనియా.  అభయ్ నవీన్ వచ్చి.. హైపర్ ఒకసారి అవ్చొచ్చు. బట్ సెకండ్ టైమ్ కనీసం ఆలోచించి మాట్లాడితే ఈ హౌజ్​కు మంచిదని చెప్పాడు. దానికి నాగమణికంఠ సీరియస్​గా రిప్లై ఇచ్చాడు. 

నా మొహమే అంతా..

మీరు ఆదిత్య అన్నకి ఒత్తాసుగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నో అంటున్నప్పుడు అంటే.. మధ్యలో నవీన్ రిప్లై ఇవ్వడానికి యత్నించాడు. లెట్​ మీ టాక్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆగాను కదా.. మీరు ఆగండి అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. నేను అతనికి వత్తాసు పలకలేదు నేను వచ్చాక ఆయన వచ్చాడు అంటూ నవీన్​ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ఆయనకు నేను చెప్పిన విధానం ఎలా అర్థమైందో తెలియదు.. ఎందుకంటే నా మొహమే అంతా.. సీరియస్​గానే కనిపించి ఉంటాదని సమర్థించుకున్నాడు. ఇవేమి తనకి పట్టవన్నట్లు కూర్చోన్నాడు ఆదిత్య. 

ఈ వారం వెళ్లేది నువ్వా.. నేనా?

సీత, ప్రేరణ మధ్య ఆర్గ్యూమెంట్ నడించింది. గేమ్​ని సీరియస్​గా తీసుకోలేదంటూ సీత ప్రేరణకు చెప్పగా.. నేను సీరియస్​గా తీసుకోలేదని నువ్వు ఎలా చెప్తావంటూ ప్రేరణ రివర్స్ క్వశ్చన్ వేసింది. మళ్లీ అభయ్, మణికంఠ గొడవ ప్రారంభమైంది. నేను అన్​ఫిట్​ అయితే ఈ వారమే వెళ్లిపోతాను. నేను కూడా వెళ్లిపోవచ్చని అభయ్ నవీన్ చెప్పాడు. అనంతరం మణికంఠ, విష్ణుప్రియ మధ్య వాదన నడిచింది. ఈ మూడురోజులు నీతో కలిసి ఉండడానికి రీజన్ ఏంటంటే.. నువ్వు వర్డ్స్​ని ఎలా రిలీజ్ చేస్తున్నావో చూస్తున్నానంటూ మణికంఠ తెలిపాడు. ఓహ్ గాడ్ నువ్వు అందుకు నాతో ఈ మూడు రోజులు కలిసి ఉన్నావా? అంటూ అడిగింది విష్ణుప్రియ.

అమ్మ శవం కాల్చడానికి కూడా డబ్బులు లేవు..

శేఖర్ భాష.. మణికంఠ ప్రతీది రాజకీయం చేయడానికి చూస్తున్నాడని కామెంట్ చేశాడు. ఎవరు ఏమన్నా దానిని నీకు ఆపాదించేసుకుని.. నీ గురించి చూపించుకోవడానికి వాడుకున్నావంటూ శేఖర్ తెలిపాడు. ప్రేరణ, మణికంఠ డిస్కషన్​లో అతను ఎమోషనలై.. చావు దాక వెళ్లి వచ్చాను నేను. మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా.. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. స్టెఫ్ ఫాదర్​ చులకనగా చూస్తే భరించాను. అమ్మ చనిపోయింది. కాల్చడానికి కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ శవాన్ని సాగనంపించాను అంటూ ఎమోషనలై.. అందరినీ ఏడిపించేశాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ ఇంకెన్ని ఎమోషన్స్​ని బయటకు తీస్తుందో ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

Also Read : బిగ్​బాస్​ హౌజ్​లో ట్విస్ట్​తో కూడిన నామినేషన్స్.. కుక్కలాగా అరవనంటోన్న మణికంఠ.. స్ట్రాటజీ ప్లే చేస్తున్న సోనియా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Embed widget