(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss Telugu 8 Day 2 Nomination : బిగ్‌బాస్ హౌజ్‌లో ట్విస్ట్‌తో కూడిన నామినేషన్స్.. కుక్కలాగా అరవనంటోన్న మణికంఠ.. స్ట్రాటజీ ప్లే చేస్తున్న సోనియా
Bigg Boss Telugu Promo : నామినేషన్ ప్రక్రియ మొదలైతే బిగ్‌బాస్ హౌజ్‌లో సందండి వేరుగా ఉంటుంది. బిగ్‌బాస్ సీజన్ 8 మొదటివారం నామినేషన్‌ను కొత్త ట్విస్ట్‌తో స్టార్ చేశాడు బిగ్‌బాస్.
Bigg Boss Telugu 8 First Nominations Promo : బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రతివారం నామినేషన్స్ జరుగుతున్నాయి. వీటిని బిగ్‌బాస్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు. కంటెస్టెంట్లు తమకు ఇతరులపై ఉన్న కంప్లైయింట్స్ని బట్టి ఇతరులను నామినేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మొదటివారంలోనే కంటెస్టెంట్లు నామినేషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో మొదటివారంలో నామినేషన్స్ అంటే కాస్త మొహమాటంగా ఎవిక్షన్ కోసం నామినేషన్ వేసేవారు కానీ.. బిగ్‌బాస్ సీజన్ 8 మాత్రం దానికి భిన్నంగా మారింది. మొదటివారం నుంచే నువ్వా- నేనా అనే రేంజ్లో కంటెస్టెంట్లు నామినేషన్ వేస్తున్నారు.
మొదటివారం నామినేషన్ ప్రక్రియ..
నిఖిల్, నైనిక, యశ్మీ.. ఈ వారం మీరు ఇంటి ఛీఫ్స్గా ఎన్నికైనందుకు బిగ్‌బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారంటూ బిగ్‌బాస్ తెలిపాడు. వీరికి ఈ వారం నామినేషన్స్ నుంచి వీరికి విముక్తి దొరికనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వారికి మూడు హారాలు ఇచ్చి.. సగర్వంగా వేసుకుని.. అక్కడ కుర్చీలలో కూర్చోని తెలిపాడు బిగ్‌బాస్. వెంటనే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని.. ప్రక్రియను ప్రారంభించాలని సూచించాడు. ఈ నామినేషన్స్‌కు నిఖిల్, నైనిక, యశ్మీ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు.
ఇది నా గేమ్ స్ట్రాటజీ..
ప్రోమోలో సోనియా ఆకుల ఈ నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించింది. వస్తూనే.. తను బేబక్కను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. కిచెన్‌లో బాధ్యతగా లేరంటూ తన పాయింట్ చెప్పింది. అది తనకి నచ్చలేదని తెలుపగా.. కుక్కర్లో ప్రెజర్ రాకపోతే అది నా తప్పు కాదంటూ.. బేబక్క దానికి ఆన్సర్ ఇచ్చింది. మరో ఆన్సర్ ఇస్తున్నప్పుడు సోనియా మాట్లానివ్వట్లేదంటూ.. నైనిక అడ్డుకుంది. బేబక్క ఆన్సర్‌ను ఫినిష్ చేయనివ్వమంటూ యశ్మీ కూడా తెలిపింది. దానికి బదులుగా ఇది నా గేమ్ స్ట్రాటజీ .. నీ మాట నేనెందుకు వినాలి.. తనకి చెప్పేందుకు నేను గ్యాప్ ఇవ్వను అనే రేంజ్లో సోనియా బదులిచ్చింది. తన రెండో నామినేషన్ ప్రేరణగా తెలుస్తుంది.
కట్టేసిన కుక్కలగా అరవను
నాగమణికంఠ.. సోనియాను నామినేట్ చేశాడు. ఊరికే కట్టేసిన కుక్కు అరిచినట్లు భౌ భౌ అనడం నా స్వభావం కాదు అంటూ సోనియాను ఉద్దేశించి చెప్పాడు. తర్వాత శేఖర్ భాషకు, నాగమణికంఠకు ఆర్గ్యూమెంట్ స్టార్ట్ అయింది. యూ ఆర్ నాట్ ఎ బిగ్‌బాస్, యూ ఆర్ నాట్ ఏ జడ్జ్ అంటూ.. నాగమణికంఠను శేఖర్ భాష అనగా.. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమైందని నాగమణికంఠ కౌంటర్ ఇచ్చాడు. ఓకేనా అంటే.. ఓకే కాదు అంటూ శేఖర్ డిఫెండ్ చేసుకున్నాడు.
నువ్వు ఎవరు నాకు చెప్పడానికి..
ప్రేరణ-సోనియా నామినేషన్ గొడవ తర్వాత ప్రారంభమైంది. ఓ చర్చ విషయంలో నేను డిఫెండ్ చేస్తాను. నీకు ఓపిక లేకపోతే ఐ డోంట్ కేర్ అంటూ ప్రేరణ.. సోనియాకు తెలిపింది. నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో.. అలా చేసుకుంటా.. నువ్వు ఎవరూ నాకు చెప్పడానికి అంటూ ఇచ్చిపడేసింది. దీంతో సోనియా ఫైర్ అయింది. ఫస్ట్ నా నామినేషన్ పాయింట్ అర్థం చేసుకో అంటూ అరిచింది. దానికి ప్రేరణ కూడా అదే రేంజ్లో నువ్వేవరు నాకు చెప్పడానికి అంటూ ఫైర్ అయింది.
నామినేషన్ ట్విస్ట్ ఇదే..
అయితే బిగ్‌బాస్ నామినేషన్లో పెట్టిన ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రక్రియ అంతా ఛీఫ్స్ చేతిలో ఉంటుంది. కంటెస్టెంట్లు నామినేషన్ చేసిన తర్వాత.. ఎవరి పాయింట్స్ వ్యాలిడ్‌గా ఉంటాయో.. వారిని ఛీప్స్ ఎవిక్షన్ కోసం నామినేట్ చేస్తారు. దీనికోసం ఛీఫ్స్ పోటి పడాల్సి ఉంటుంది. మరి ఈ వారం నామినేషన్లో ఎవరు ఉంటారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
">
Also Read : 'బిగ్ బాస్ 8'లో సీరియల్ ఆర్టిస్టులకు షాక్ - ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లోని నలుగురిలో ఆ ముగ్గురూ...