By: ABP Desam | Updated at : 27 Sep 2021 08:57 AM (IST)
జిలేబి (Image credit-Instagram/foodie_incarnate )
సోషల్ మీడియా వచ్చాక దూరం తగ్గిపోయింది. ఏ ప్రాంతంలో జరిగినదైనా సామాజిక మాధ్యమాల ద్వారా ఇట్టే ఖండాంతరాలు దాటి వెళ్లిపోతోంది. ముఖ్యంగా కొత్త కొత్త ఆహారాలు, వెరైటీ వంటకాలైతే మరీ స్పీడుగా షేర్ అవుతున్నాయి. అందుకే ఫుడ్ బ్లాగింగ్ ట్రెండింగ్ గా మారింది. చాలా మంది యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు అమర్ సిరోహి. ఇండియాలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ దొరికే వెరైటీ వంటకాలను పరిచయం చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇండోర్ లో పర్యటించారు. అక్కడ కూడళ్లలో తిరుగుతూ అనేక రకాల ఆహార పదార్థాలు రుచి చూశారు. వాటిల్లో ఒకటి ఈ జిజాంటిక్ జిలేబి.
మనకు తెలిసిన జిలేబి చిన్నవిగా, అరచేతిలో ఇమిడేంత ఉంటాయి. కానీ ఇండోర్లో ఒక్కో జిలేబి బరువు కిలో తూగుతుంది. అంత బరువైనవి వేసి అమ్ముతున్నారక్కడ. అమర్ సిరోహి ఆ జిలేబీలపై వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇండోర్ లోని సరఫా బజార్ లో ఓ జిలేబీ బండి దగ్గర ఈ వీడియోను షూట్ చేశారు. జిలేబీ పిండిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ రంగులు కలపకుండా ఎంత చక్కగా జిలేబి చేశారో మీరూ చూడండి. ఆ జిలేబి పెద్ద ప్లేటులోకి ముక్కలుగా చేసి, లిక్విడ్ కోవాను పైన చల్లి వినియోగదారులకు అందిస్తున్నారు. చూస్తేనే నోరూరిపోతుంది. అందుకేనేమో అమర్ పోస్టు చేసిన వీడియోను దాదాపు పదహారున్నర లక్షల మంది వీక్షించారు.
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ డ్రింకులకు దూరంగా ఉండండి
Also read: రోజుకో గ్లాసుడు రాగి జావ తాగండి.. వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం తగ్గుతుంది
Also read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్ను సంప్రదించాల్సిందే!
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్లో ఉన్న దేశం అదే
Breast Milk: కరవైన పాలపొడి, తన రొమ్ము పాలతో ఎంతో మంది బిడ్డల ఆకలి తీర్చుతున్న అలెస్సా
Dinner Time: రాత్రిభోజనం రోజుకో టైమ్కి చేస్తున్నారా? అయితే ఆ సమస్య వచ్చే ముప్పు అధికం
Fire Safety tips at Home: వంట చేసేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు