అన్వేషించండి

Immune Boosting Soup Recipe : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే, శీతాకాలంలో ఈ సూప్ తాగండి

Immune Boosting Soup Recipe : రోగనిరోధక శక్తి చాలా అవసరం. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. లేదంటే సీజన్ వ్యాధులు త్వరగా వచ్చే అవకాశముంది. 

Immune Boosting Soup Recipe : చలికాలంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బ్యాక్టీరియా, వైరల్ ఇన్​ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది కంటి ఆరోగ్యం, చర్మానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సాహిస్తుంది. అందుకే పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆరోగ్యకరమైన పోషకాలలో బీటా కెరోటిన్ ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి, చర్మ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ నష్టాలను అరికడుతుంది. విటమిన్ సితో నిండిన సూప్.. బలమైన రోగనిరోధక వ్యవస్థను, రోజువారీ పోషకాలను అందిస్తుంది. 

వీటన్నింటిని మీరు బీటా కెరోటీన్ సూప్​లో పొందవచ్చు. దీనిలో కెరోటినాయిడ్.. కొన్ని క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ సూప్​లోని విటమిన్ ఎ.. మీలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తుంది. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఆహారంలోని బీటా కెరోటిని.. శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఎ గా మారుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వెజ్​ సూప్​ను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన విషయాలు ఏంటి? దీనివల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

టమోటాలు - 3

బీట్​రూట్​లు - 2 (చిన్నవి)

క్యారెట్  - 1

ఉల్లిపాయ - 1

జీలకర్ర - అర టీస్పూన్

గరం మసాలా - 1 టీస్పూన్

ఉప్పు- రుచికి తగినంత 

పెప్పర్ పౌడరు - చిటికెడు

తయారీ విధానం

ముందుగా టమోటాలు, బీట్​రూట్, క్యారెట్, ఉల్లిపాయలను చిన్నగా తురుముకోవాలి. వీటన్నింటినీ కుక్కర్​లో వేయాలి. దానిలో జీలకర్ర వేసి.. కప్పు నీరు పోసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెజర్​ అంతా బయటకు వెళ్లేవరకు ఆగండి. కుక్కర్​లో ప్రెజర్​ పోయి.. చల్లారే వరకు వేచి ఉండండి. ఇప్పుడు ఉడికించిన కూరగాయాలను బ్లెండర్​లో వేసి.. మెత్తని పేస్ట్ వచ్చే వరకు బ్లెండ్ చేయండి. 

ఇలా కూరగాయలను ఉడికించి పేస్ట్ చేయడం వల్ల కూరగాయల్లోని పచ్చివాసన తగ్గుతుంది. ఇప్పుడు స్టౌవ్​ వెలిగించి నాన్​స్టిక్ పాన్ పెట్టాలి. అది వేడి అయిన తర్వాత మిక్సీ చేసుకున్న కూరగాయల పేస్ట్ వేయాలి. అనంతరం గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అది బాగా మరిగే వరకు ఉంచి.. స్టవ్​ ఆపేయాలి. వేడిగా ఉన్నప్పుడు తాగితే.. ఉదయాన్నే చలి వదిలి.. మీరు రోజంతా చురుగ్గా ఉంటారు. మధుమేహం ఉన్నవారు కూడా ఈ హాట్​ సూప్​ను తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. చల్లని ఉదయానా.. వేడి వేడి సూప్ చేసి తాగేయండి. 

Also Read : మీకు మధుమేహం ఉందా? అయితే ఈ స్మూతీ రెసిపీ మీకోసమే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget