అన్వేషించండి

Best Friend Problems : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది

Tips to Reconnect With Your Best Friend : బెస్ట్ ఫ్రెండ్​తో గొడవై.. ఆ డిస్టర్బెన్స్​ని ఎలా దూరం చేసుకోవాలో తెలియట్లేదా? అయితే వారితో మళ్లీ మంచి బాండ్ క్రియేట్ చేసుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్నేహంలో తలెత్తే అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవడం ముఖ్యం.
  • సమస్యను ఎదుర్కొని, వారి అభిప్రాయం గౌరవించి, సారీ చెప్పండి.
  • పాత గొడవలు వద్దు, గెలుపు కన్నా స్నేహమే ముఖ్యమనుకోండి.

Best Friends Day 2026 : ఫ్రెండ్స్ ఎందరు ఉన్నా.. బెస్ట్ మాత్రం ఒక్కరు లేదా ఇద్దరు ఉంటారు. వాళ్లతో మన సంతోషాలు, బాధలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ ఎలాంటి దాపరికం లేకుండా షేర్ చేసుకుంటాము. ఎందుకంటే వాళ్లు మనల్ని జడ్జ్ చేయరు అనే భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ కొన్నిసార్లు.. కొన్ని సందర్భాల్లో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. ఎంత మంచి స్నేహమైనా చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే అలాంటి సమస్యలను లైట్ తీసుకుని.. సరైన సమయంలో పరిష్కరించకుకోకపోతే విలువైన స్నేహం దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. 

మీ బెస్ట్ ఫ్రెండ్​తో మీకు గొడవ అయినప్పుడు లేదా ఏదైనా చిన్న విషయం వల్ల దూరంగా ఉంటే వెంటనే ఆ విషయాలను క్లియర్ చేసుకోండి. మొదటి స్టెప్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదా? అయితే మీ బెస్ట్​ ఫ్రెండ్​తో మీకు ఉన్న విభేదాలను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

ఫేస్ చేయండి..

గొడవ జరిగిన తర్వాత చాలామంది మాట్లాడటం మానేస్తారు. కానీ మౌనం సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అసలు సమస్య ఏంటో ఓపెన్‌గా మాట్లాడండి. వాళ్లని, పరిస్థితిని ఫేస్ చేస్తే కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి వారిని మీట్ అయి.. మీ పరిస్థితిని వివరించండి. 


Best Friend Problems : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది

వారి అభిప్రాయం గౌరవించండి..

మీ ఒపీనియన్ చెప్పే ముందు.. వారి అభిప్రాయం కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మీ ఫ్రెండ్ ఏమనుకుంటున్నారో పూర్తిగా వినండి. కొన్నిసార్లు అపార్థాలే పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాగే వారి ఫీలింగ్స్​ని అర్థం చేసుకోండి. 

తప్పు ఉంటే సారీ చెప్పాల్సిందే..

కొన్ని సందర్భాల్లో సారీ అనే ఒక్క మాట చాలు. తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో సంబంధాలను ఇది కాపాడగలదు. మీ వల్ల పొరపాటు జరిగిందని మీకు అనిపిస్తే వెంటనే మీ ఇగోని పక్కన పెట్టి సారీ చెప్పేయండి. ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకున్నా మీకు కాస్త రిలీఫ్​గా ఉంటుంది.


Best Friend Problems : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది

పాత విషయాలను లాగొద్దు

ఎప్పుడైనా ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవాలని.. ఎప్పుడో జరిగినా విషయాలను మళ్లీ తీసుకురాకూడదు. పాత గొడవలు లేదా పాత తప్పులను గుర్తు చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. 

గెలవడం ముఖ్యం కాదు

మీకు మీ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అనుకుంటే.. వాదనలో ఎవరు కరెక్ట్ అనేది కొన్నిసార్లు పక్కన పెట్టేయాలి. స్నేహితులే ముఖ్యం అనుకుంటే ప్రతి విషయాన్ని గెలుపు-ఓటమిగా చూడకండి.

కొంత సమయం ఇవ్వండి

కొన్ని సందర్భాల్లో మీ సమస్యకు వెంటనే పరిష్కారం దొరకకపోవచ్చు. కాబట్టి వారికి కాస్త సమయం ఇవ్వండి. దీనివల్ల ఎమోషన్స్ తగ్గి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.


Best Friend Problems : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది

ఫైనల్​గా

ఎంత కోపం వచ్చినా ఎదుటివ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడకండి. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటే మీ ఫ్రెండ్​షిప్ పూర్తిగా తెగిపోతుంది. నిజమైన బెస్ట్ ఫ్రెండ్ అనేది జీవితంలో దొరికే అత్యంత విలువైన బహుమతుల్లో ఒకటి కాబట్టి. చిన్న చిన్న అపార్థాల వల్ల ఆ బంధాన్ని కోల్పోకుండా.. అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. ఈ Best Friends Day సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్‌కు ఒక మెసేజ్ పంపి మీ గొడవలు, అపార్థాలకు చెక్ పెట్టే అడుగు వేసేయండి. 

రిలేషన్​షిప్స్​ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget