రోజూ మెగ్నీషియం తీసుకుంటే మెదడులో ఏమవుతుంది? ఇంట్రెస్టింగ్ విషయాలివే

Published by: Geddam Vijaya Madhuri

శరీరంలో తగినంత మెగ్నీషియం ఉండటం వల్ల మెదడు కణాల మధ్య సమాచార మార్పిడి సజావుగా జరిగేందుకు సహాయపడవచ్చు.

మెగ్నీషియం లోపం ఉన్నవారిలో ఏకాగ్రత సమస్యలు కనిపించవచ్చు. సరైన మోతాదులో తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.

మెగ్నీషియంను రిలాక్సేషన్ మినరల్ అని పిలుస్తారు. ఇది మానసిక ఒత్తిడి, టెన్షన్ తగ్గించడంలో కొంత సహాయపడవచ్చు.

నిద్ర నాణ్యతపై మెగ్నీషియం ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి నిద్ర ఆరోగ్యం మెరుగుపడొచ్చు.

కొన్ని పరిశోధనల్లో మెగ్నీషియం మెదడులో నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రక్రియలకు మద్దతు ఇస్తుందని గుర్తించారు.

మెగ్నీషియం లోపం ఉన్నవారిలో చిరాకు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపించవచ్చు. కాబట్టి ఇవి కంట్రోల్ అవుతాయి.

మెగ్నీషియం నరాల ఉత్తేజాన్ని నియంత్రించడంలో భాగస్వామ్యం అవుతుంది. దీంతో శరీరం, మెదడు అధిక ఉద్రిక్తతకు గురికాకుండా ఉంటుంది.

మెగ్నీషియం లోపం మైగ్రేన్‌తో సంబంధం ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారు మెగ్నీషియం తీసుకుంటే మంచిది.

మెగ్నీషియం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి.

మెగ్నీషియం ఆరోగ్యానికి అవసరమైన ఖనిజమే అయినా, అందరికీ సప్లిమెంట్లు అవసరం ఉండకపోవచ్చు.

అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వైద్యుల సలహా మేరకే సప్లిమెంట్లు వాడాలి.