అరటిపండు తింటే బరువు పెరుగుతారా? అపోహలు, నిజాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ.. కేవలం అరటిపండు తినడం వల్లనే బరువు పెరగరు.

ఒక అరటిపండులో సుమారు 100 నుంచి 120 కేలరీలు ఉంటాయి. ఇది అనేక జంక్ ఫుడ్స్‌తో పోలిస్తే చాలా తక్కువ.

అరటిపండులో ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండొచ్చు. దీంతో మధ్యలో అనవసరంగా స్నాక్స్ తినడం తగ్గిపోతుంది.

బరువు తగ్గాలనుకునే వారు కూడా అరటిపండును తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. అయితే పరిమాణాన్ని నియంత్రించడం ముఖ్యం.

వర్కౌట్ ముందు లేదా తర్వాత అరటిపండు తినడం వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది.

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు, శరీరంలో ద్రవాల సమతుల్యతకు సహాయపడుతుంది.

అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

ఏ ఆహారం అయినా మితిమీరితే కేలరీలు పెరుగుతాయి. రోజూ ఎక్కువ అరటిపండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బాగా పండిన అరటిపండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.

అరటిపండును ప్రోటీన్, కూరగాయలు, ఇతర పండ్లతో కూడిన సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.