పిల్లలు హోమ్ వర్క్ చేయట్లేదా? ఈ టిప్స్​తో ఈజీగా చేయించొచ్చు

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజూ ఒకే సమయంలో హోమ్ వర్క్ చేసే అలవాటు పెడితే.. త్వరగా ఆ రొటీన్‌కు పిల్లలు అలవాటు పడతారు. దీంతో ఆలస్యం చేయడం తగ్గుతుంది.

టీవీ, మొబైల్, ఇతర డిస్ట్రాక్షన్స్ లేకుండా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో హోమ్ వర్క్ చేయించండి. దీంతో పిల్లలు ఏకాగ్రతతో ఉంటారు.

హోమ్ వర్క్ ఎక్కువగా ఉంటే ఒకేసారి కాకుండా.. చిన్న భాగాలుగా డివైడ్ చేయండి. ఇది పిల్లలకు పని సులభమయ్యేలా చేస్తుంది.

ఎక్కువసేపు నిరంతరంగా చదవడం వల్ల పిల్లలు విసుగు చెందవచ్చు. కాబట్టి 20-30 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ ఇవ్వడం మంచిది.

పిల్లలతో తొందరగా రాయి, చేయి అంటూ ఒత్తిడి ఇవ్వడం కాకుండా.. నువ్వు చేయగలవని ప్రోత్సహిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పుస్తకాలు, పెన్సిల్స్, నోట్‌బుక్స్ వంటి వస్తువులు దగ్గర్లో ఉంటే మధ్యలో లేచి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ముందుగా ఏ సబ్జెక్ట్ చేయాలి.. ఏది తర్వాత చేయాలి అనే చిన్న ప్లాన్ తయారు చేస్తే వారు ఫాలో అవ్వడం ఈజీగా ఉంది.

హోమ్ వర్క్‌లో పొరపాట్లు చేయడం సహజం. వాటిని సరిదిద్దాలి కానీ.. వారిని శిక్షించకూడదు.

హోమ్ వర్క్ పూర్తి చేసినప్పుడు లేదా బాగా చేసినప్పుడు ప్రశంసించండి. ఇది పిల్లల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

నిద్ర సరిగా లేకపోయినా, ఆకలిగా ఉన్నా పిల్లలు హోమ్ వర్క్‌పై దృష్టి పెట్టలేరు. కాబట్టి మంచి ఆహారం, సరిపడ నిద్ర చాలా ముఖ్యం.