రోజ్మెరీ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజ్మెరీ వాటర్ తలకు అప్లై చేస్తే రక్తప్రసరణ పెరిగి.. హెయిర్ ఫాలికల్స్‌కు పోషకాలు బాగా అందుతాయి. ఇది జుట్టు పెరిగేలా చేస్తుంది.

క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు బలంగా మారి విరిగిపోవడం, రాలిపోవడం తగ్గే అవకాశం ఉంటుంది.

రోజ్మెరీలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు తలపై ఉండే కొన్ని రకాల ఫంగస్, బ్యాక్టీరియాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

స్కాల్ప్​పై ఉండే దురద, పొడిబారడం వంటి సమస్యలను తగ్గించి స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోజ్మెరీ వాటర్‌ను హెయిర్ రిన్స్‌గా ఉపయోగిస్తే జుట్టు మరింత మృదువుగా, మెరిసేలా కనిపించవచ్చు.

రోజ్మెరీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రోజ్మెరీతో తయారుచేసిన నీటిని మితంగా తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణక్రియ మెరుగై, కడుపు ఉబ్బరం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.

రోజ్మెరీ సువాసన మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏకాగ్రత పెరుగుతుంది.

రోజ్మెరీలోని కొన్ని సహజ సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో వాపును తగ్గించడంలో పాత్ర పోషించవచ్చు.

రోజ్మెరీ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తారు. దీనివల్ల కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు సమర్థంగా చేరుతాయి.

నిపుణుల, వైద్యుల సలహా తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.