రాత్రుళ్లు లేట్​గా పడుకుంటే కలిగే ఇబ్బందులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రాత్రి ఆలస్యంగా నిద్రపోతే శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. దీంతో ఉదయం లేవగానే అలసట, బద్ధకం, నీరసం కనిపించవచ్చు.

నిద్ర సరిగా లేకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. చదువు, ఉద్యోగం లేదా రోజువారీ పనులపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది.

నిద్ర సమయంలోనే మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. లేట్‌గా పడుకోవడం వల్ల గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.

తక్కువ నిద్ర వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగి బరువు పెరగవచ్చు.

శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రలేమి వల్ల చిరాకు, ఆందోళన, ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొందరిలో మూడ్ స్వింగ్స్ కూడా కనిపించవచ్చు.

దీర్ఘకాలంగా రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హై బీపీ, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నిద్ర సమయంలో చర్మ కణాలు రీసెట్ అవుతాయి. సరైన నిద్ర లేకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం మసకబారడం వంటి సమస్యలు రావచ్చు.

తక్కువ నిద్ర వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించలేకపోవచ్చు. దీంతో టైప్-2 డయాబెటిస్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.

రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల రోజంతా శక్తి తగ్గిపోతుంది. పనితీరు, ఉత్సాహం, ఉత్పాదకత తగ్గి జీవన నాణ్యతపై ప్రభావం పడుతుంది.