ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

ఇంగ్లీష్ వార్తలు, ఆర్టికల్స్, పుస్తకాలు లేదా బ్లాగులు చదవడం వల్ల కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు నేర్చుకోవచ్చు. రోజుకు కనీసం 15–20 నిమిషాలు చదవండి.

తప్పులు మాట్లాడతామనే భయాన్ని పక్కన పెట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రారంభించండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే ఫ్లూయెన్సీ పెరుగుతుంది.

ప్రతిరోజూ 5 నుంచి 10 కొత్త పదాలు నేర్చుకుని వాటి అర్థాలు, ఉపయోగాలు రాసుకోవడం మంచిది. వాటిని సంభాషణల్లో ఉపయోగించడానికి ప్రయత్నించండి.

ఇంగ్లీష్ మూవీస్, యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు సబ్‌టైటిల్స్‌తో చూడడం వల్ల ఉచ్చారణ, పదాల వినియోగం అర్థమవుతుంది.

పాడ్‌కాస్ట్‌లు, వార్తలు, ఇంటర్వ్యూలు వినడం ద్వారా లిసనింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇది మాట్లాడే నైపుణ్యానికి కూడా సహాయపడుతుంది.

డైరీ, నోట్స్ లేదా సోషల్ మీడియా పోస్టులు ఇంగ్లీష్‌లో రాయడానికి ప్రయత్నించండి. దీనివల్ల గ్రామర్, వాక్య నిర్మాణం మెరుగుపడుతుంది.

టెన్సెస్, ప్రీపొజిషన్స్, సబ్జెక్ట్-వర్బ్ అగ్రిమెంట్ వంటి ప్రాథమిక గ్రామర్ అంశాలు నేర్చుకోవడం వల్ల తప్పులు తగ్గుతాయి.

చిన్న చిన్న విషయాలైనా మనసులో ఇంగ్లీష్‌లో ఆలోచించడం అలవాటు చేసుకుంటే భాషపై పట్టు పెరుగుతుంది.

వివిధ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ద్వారా పదజాలం, గ్రామర్, ఉచ్చారణను సరదాగా నేర్చుకోవచ్చు.

ఇంగ్లీష్ ఒక రోజులో రాదు. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమంగా మాట్లాడే, రాసే, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.