Winter Snacks : వింటర్ క్రేవింగ్స్ తీర్చే టేస్టీ స్నాక్స్.. కరకరలాడే దేశీ వంటకాలు ఇవే
Crispy and Tasty Snacks : శీతాకాలంలో సాంప్రదాయ భారతీయ చిరుతిళ్లు ఎక్కువగా తింటారు. మరి ఈ సమయంలో ఇండియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఏంటో చూసేద్దాం.

చలికాలంలో వేడిగా, కరకరలాడే, కడుపు నింపే స్నాక్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ట్రెడీషనల్ వంటకాలు ఎక్కువగా చేసుకుంటారు. పండుగల సమయం కావడం వల్ల వివిధ రకాల స్నాక్స్ చేస్తారు. ఇవి కేవలం క్రేవింగ్స్ తీర్చడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ఉంటాయి. పండుగల సమయంలో ఇళ్లలో తయారుచేసుకునేవి లేదా సాయంత్రం టీతో ఆస్వాదించే స్నాక్స్ చాలా అందుబాటులో ఉంటాయి. వింటర్ క్రేవింగ్స్ తీర్చే, ఎక్కువమంది తినే స్నాక్స్ ఏంటో.. వాటిని ఎలా చేస్తారో చూసేద్దాం.
నువ్వుల పట్టి
కరకరలాడే, తీపి రుచితో ఎంతో సంతృప్తినిచ్చే నువ్వుల పట్టీ దీనిలో ముందు ఉంటుంది. దీనిని తిల్ చిక్కీ అని కూడా పిలుస్తారు. ఇది అనేక ఇళ్లల్లో ప్రధాన ఆహారం. కరిగించిన బెల్లంలో నువ్వులు వేసి దీనిని తయారు చేస్తారు. ఈ వంటకం తీపి వంటకం కరకరలాడుతూ మంచి తృప్తినిస్తుంది. పైగా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
చిక్కీ
చిక్కీ అనేది ఎక్కువమంది ఇండియన్స్ తినే టేస్టీ స్నాక్. గట్టిగా, కరకరలాడే ఆకృతితో సంతృప్తికరమైన తీపిని ఇస్తుంది. బెల్లం, పల్లీలు ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఇది తక్కువ తిన్నా.. నిండుగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే దీనిని సీజనల్ స్నాక్‌గా ఎక్కువమంది తీసుకుంటారు. కేవలం పల్లీ చిక్కీనే కాదు.. తిల్ చిక్కీ, కొబ్బరి చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ వంటి ప్రసిద్ధ రకాలు ఉన్నాయి. వీటిని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేస్తే ఎక్కువరోజులు ఉంటాయి.
లప్సీ
లప్సీ అనేది దలియా అని పిలిచే గోధుమరవ్వతో చేసే వేడి, ఆరోగ్యకరమైన తీపి వంటకం. దీనిని బెల్లంతో వండుతారు. చల్లని వాతావరణంలో ప్రత్యేకంగా సౌకర్యవంతంగా అనిపించే జిగట, గొప్ప ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది. చలి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనిని నార్త్ వాళ్లు ఎక్కువగా చేసుకుంటారు.
సకినలు
సకినలు తెలంగాణకు చెందిన ఒక సాంప్రదాయ స్నాక్. ఇది దాని కరకరలాడే ఆకృతి, విలక్షణమైన స్పైరల్ ఆకారానికి ప్రసిద్ధి. బియ్యం పిండి, నువ్వులతో వీటిని తయారు చేస్తారు. సంపూర్ణంగా కరకరలాడే వరకు డీప్-ఫ్రై చేస్తారు. నువ్వులు వాటి రుచిని పెంచుతాయి. ఇది శీతాకాలపు స్నాకింగ్‌కు అనుకూలమైనది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. పండుగల సమయంలో వీటిని కచ్చితంగా చేసుకుంటారు.
మురుకులు
మురుకులు, అనేక ప్రాంతాలలో చేసుకుంటారు. వీటిని బియ్యం పిండి, పప్పులతో తయారు చేస్తారు. తేలికగా మసాలా దినుసులు వేసి, స్పైరల్స్‌గా ఆకారంలో తయారు చేస్తారు. ప్రతి బైట్లో కరకరలాడే రుచి మీ సొంతమవుతుంది. ఈ స్నాక్ ఎక్కువగా తయారు చేసుకుని.. స్టోర్ చేస్తారు. టీతో పాటు చాలామంది వీటిని తీసుకుంటారు.
కచోరి
బయట కరకరలాడుతూ.. లోపల మసాలా కూరతో నిండిన కచోరి ఉత్తర, పశ్చిమ భారతదేశంలో శీతాకాలపు ఇష్టమైనది. పెసరపప్పు, బఠానీలు లేదా సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలతో దీనిని చేస్తారు. ఇది ప్రతి బైట్లో రుచిని ఇస్తుంది. వేడిగా, రుచికరంగా ఉండే రోజులలో వీటిని ఎక్కువగా తింటారు.






















