అన్వేషించండి

Belly Fat Reducing Tips : పొట్ట తగ్గించుకోవడానికి మగవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. ఈ మార్పులు చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్ బెల్లీ మీ సొంతం

Belly Fat : పొట్టకొవ్వును తగ్గించుకునేందుకు మగవారు తమ రోటీన్​ను మార్చుకోవాలి అంటున్నారు నిపుణులు. వాటిని ఫాలో అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందని చెప్తున్నారు. 

Flat Belly in 30 Days : మగవారు చూసేందుకు ఫిట్​గా ఉన్నా.. కొందిరికి పొట్ట దగ్గర మాత్రం కొవ్వు ఉంటుంది. అయితే ఇలా బెల్లీ దగ్గర ఏర్పడే కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఇది వారిలో గుండె సమస్యలకు దారిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. అందుకే జెంట్స్ పొట్టను కచ్చితంగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. దానికోసం రెగ్యులర్​గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు. ముఖ్యంగా 35 నుంచి 69 వయసు మధ్య ఉన్నవారు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయవద్దని చెప్తున్నారు. దానిని ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

హైడ్రేషన్.. 

మంచి నీటిని రెగ్యులర్​గా తీసుకుంటే స్కిన్​ హెల్తీగా ఉంటుంది. వయసు కంటే యవ్వనంగా కనిపిస్తారు. అలాగే మెటబాలీజం పెరుగుతుంది. ఆకలిని తగ్గించి.. పొట్ట కొవ్వును కరిగించడంలో హైల్ప్ చేస్తుంది. రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగితే మంచిది. 

పోషకాహారం..

ఫుడ్ తినడం కాదు.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలిస్తే కూడా బరువు తగ్గడం, బెల్లీ ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది. ఎనర్జీనిచ్చే ఫుడ్​ని తినాలి. వీటివల్ల మెటబాలీజం పెరిగి పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఒబేసిటీ సమస్యలను ఇది దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్స్, మినరల్స్, అమోనో యాసిడ్స్ ఉండే పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగాను ఉంటారు. అలాగే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. 

మెరుగైన నిద్రకై

మంచి నిద్ర ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. బరువును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బెడ్ కంఫర్ట్​బుల్​గా ఉండేలా చూసుకోవాలి. మీరు పడుకునే రూమ్ చీకటిగా ఉంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 9 నుంచి 10 మధ్యలో పడుకుంటే మంచిది. గదిలో ఉష్ణోగ్రతలు కూడా మీకు కంఫర్ట్​బుల్​గా ఉండేలా చూసుకోవాలి. 

ఫాలో అవ్వాల్సిన టిప్స్

రాత్రి పడుకునే మూడు గంటల ముందే డిన్నర్ ముగించేయాలి. రెండు గంటల ముందు నుంచి నీటిని తాగకపోవడమే మంచిది. గంట ముందు నుంచి మొబైల్స్, గ్యాడ్జెట్స్​ ఉపయోగించకకూడదు. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. 

వ్యాయామం

కనీసం వారంలో మూడు రోజులు బరువులు ఎత్తడం ప్రాక్టీస్​ చేయాలి. బరువును తగ్గించుకునేందుకు, కేలరీలను బర్న్ చేస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కార్డియో చేయాలి. రోజుకు కనీసం 10 నుంచి 20 వేలు స్టెప్స్ వేయాలి. ఇవన్నీ చేయడం వల్ల హార్మోన్ స్పైక్​ అయ్యి.. కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోండి.. 

ఒత్తిడి వల్లనే పొట్ట చుట్టు ఎక్కువ కొవ్వు ఏర్పడుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఫాలో అవ్వాలి. వ్యాయామం చేస్తూ.. హెల్తీగా తింటూ.. ఓపెన్ మైండ్​తో.. పనిని రెస్పాన్స్​బులిటీగా చేస్తూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. మెడిటేషన్, వ్యాయామం, యోగా.. స్ట్రెస్​ని దూరం చేస్తాయి. అలాగే చేయాల్సిన పనిని పెండింగ్​లో పెట్టకుండా వెంటనే ముగించుకుంటే ఒత్తిడి ఉండదు. నచ్చిన వ్యక్తితో మాట్లాడినా కూడా స్ట్రెస్ తగ్గుతుంది. 

ఫాస్టింగ్.. 

రోజులో మీరు 4 నుంచి 8 గంటల్లో ఫుడ్ తింటే.. మరింత సమయాన్ని మీరు జీర్ణశయం రీసెట్​ అవ్వడానికి వదిలేయాలి. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనిని ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. వారు ఇచ్చే సూచనలతో మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు. వారంలో ఒక రోజు లేదా.. నెలలో మూడు నుంచి నాలుగు రోజులు పూర్తిగా ఉపవాసం ఉంటే కూడా మంచిదే. ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉంటే.. శరీరానికి బి విటిమిన్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్,  ఉప్పు కలిపిన నీళ్లు తాగితే మంచిది. 

వాటికి దూరంగా ఉండండి.. 

కార్బ్స్​, ఆల్కహాల్, పంచదార ఎక్కువ కలిగిన ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే ఇవి శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్​ని పెంచుతాయి. దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవ్వదు. తద్వార పొట్ట దగ్గర కొవ్వు తగ్గదు. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరూ పర్​ఫెక్ట్ కాదు. కానీ ట్రై చేస్తే అందరూ పర్​ఫెక్ట్ కావొచ్చు. అలాగే పొట్టను తగ్గించుకోవాలనుకున్నప్పుడు కనీసం మీరు 85 శాతం ఎఫెర్ట్స్ పెడితే.. మిగిలిన 15 శాతం మీరు ఫాలో అవ్వకపోయినా మంచి ఫలితాలు పొందవచ్చు. 

Also Read : బీపీని తగ్గించుకోవడానికి ఈ మార్పులు చేయండి.. ఆ ఒక్కటి మానేయాలి, ఈ ఫుడ్స్ తినేయాలి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget