అన్వేషించండి

Beetroot for Kidney Patients : కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి

Beetroot Risks for Kidney Patients : బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కిడ్నీల సమస్యలు ఉన్నవాళ్లు దీనిని తినవచ్చా? నిపుణులు ఏమి సూచనలు ఇస్తున్నారో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీట్‌రూట్ ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లతో శక్తినిస్తుంది.
  • అధిక ఆక్సలేట్స్, పొటాషియం కిడ్నీ సమస్యలు పెంచుతాయి.
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహాతో బీట్‌రూట్ తినాలి.
  • మూత్రం రంగు మారినా, నిరంతరంగా ఉంటే వైద్యులను సంప్రదించండి.

Beetroot and Kidney Health : బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపడటానికి, శరీరానికి ఎనర్జీ అందించడానికి సహాయం చేస్తాయి. కానీ ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎంతైనా తినొచ్చు అనుకోవడం తప్పు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

బీట్​రూట్​లోని కొన్ని పదార్థాలు కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని  వైద్యులు అంటున్నారు. ఇంతకీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? బీట్​రూట్​ తింటే కలిగే లాభాలు, నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

బీట్‌రూట్ వల్ల కలిగే లాభాలు

బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్.. రక్తనాళాలు రిలాక్స్ అవ్వడంలో సహాయపడతాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జీ అందుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే చాలామంది జ్యూస్ రూపంలో వీటిని తీసుకుంటుంటారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గిస్తుంది. 


Beetroot for Kidney Patients : కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి

కిడ్నీ సమస్యలుంటే జాగ్రత్త.. ఎందుకంటే

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నిపుణలు చెప్తున్నారు. ఎందుకంటే బీట్‌రూట్‌లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొందరిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే స్టోన్స్ హిస్టరీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే జ్యూస్ రూపంలో బీట్​రూట్​ తీసుకుంటే ఆక్సలేట్స్, షుగర్ పరిమాణం ఎక్కువగా శరీరానికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యూస్​గా తీసుకోకపోవడమే బెటర్. లేకుంటే తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. 

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో పొటాషియం లెవెల్స్ పెరగొచ్చు. బీట్‌రూట్‌లో కూడా పొటాషియం ఉంటుంది. కాబట్టి తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కిడ్నీ సమస్య ఉంది కాబట్టి బీట్‌రూట్ పూర్తిగా మానేయాలని రూల్​ కూడా లేదని.. కిడ్నీ సమస్య, రకం, దశ, రిపోర్ట్స్ ఆధారంగా డాక్టర్లు సూచించిన డైట్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. 

మూత్రం రంగు మారుతుందా?


Beetroot for Kidney Patients : కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా? లాభాలు, నష్టాలు తెలుసుకోండి

బీట్‌రూట్ తిన్న తర్వాత కొందరిలో మూత్రం లేదా మలం ఎరుపు రంగులో కనిపించొచ్చు. ఇది హానికరం కాదు. కానీ నిరంతరం ఇలా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

వైద్యుల సలహా 

కిడ్నీ వ్యాధి, డయాలసిస్, కిడ్నీ స్టోన్స్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకునే ముందు వైద్యుల లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది అని ఎలాంటి సూచనలు లేకుండా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

కిడ్నీల ఆరోగ్యానికి సంబంధిన విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget