అన్వేషించండి

Puffy Face in the Morning : ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే

Morning Face Swelling : నిద్రలేచిన వెంటనే ఉదయాన్నే ముఖం ఉబ్బడం సహజమే. కానీ ఇలా రెగ్యులర్గా జరిగితే జాగ్రత్త. ఎక్కువసార్లు ఇలా జరుగుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉదయం ముఖం ఉబ్బడం, అతిగా ఉప్పు తినడం లేదా నిద్రలేమి కారణం.
  • అలర్జీలు, హార్మోన్ల మార్పులు, సైనస్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు కారణం కావచ్చు.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల వాపు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
  • డీహైడ్రేషన్, మద్యం, ధూమపానం వంటివి కూడా ముఖం ఉబ్బడానికి దోహదం చేస్తాయి.

Swollen Face Causes and Warning Signs : ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం ఉబ్బిపోయినట్లు కనిపించడం చాలామందికి ఉండే సాధారణ సమస్య. అందుకే దీనిని చాలామంది లైట్ తీసుకుంటారు. ఇలా నిద్రలేకపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం లేదా అలసట వల్ల తాత్కాలికంగా వస్తుంది అనుకుంటారు. కానీ ప్రతిరోజూ నిద్రలేవగానే ముఖంలో వాపు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. 

ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే.. రెగ్యులర్గా ఇలా కనిపిస్తుంటే ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవద్దని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది అలర్జీలు, హార్మోన్ల మార్పులు, సైనస్ సమస్యలు, థైరాయిడ్, కిడ్నీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ముఖం ఉబ్బడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల వాపు, అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి ఉదయాన్నే ముఖం ఉబ్బడానికి కారణాలు ఏంటి? ఎప్పుడు జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

రాత్రుళ్లు ఉప్పు ఎక్కువ తినడం

రాత్రి సమయంలో ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తింటే శరీరంలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లు కనిపించొచ్చు. కాబట్టి రాత్రుళ్లు ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

నిద్ర లేకపోవడం

నిద్ర సరిగా లేకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ వాపు, ముఖం పఫ్‌గా కనిపించడానికి కారణం కావచ్చు. కాబట్టి రాత్రి నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోండి. 

అలర్జీలు కావచ్చు

దుమ్ము, పొగ, కొన్ని ఫుడ్స్ లేదా స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వల్ల అలర్జీ వచ్చినప్పుడు కూడా ముఖం ఉబ్బుతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఏ ఫుడ్స్ పడట్లేదో తెలుసుకోవాలి. స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ వల్ల అనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 

డీహైడ్రేషన్ కూడా కారణమే

శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు శరీరం ద్రవాలను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ముఖం కొంత ఉబ్బినట్లు కనిపించవచ్చు.

సైనస్ ఎఫెక్ట్

సైనస్ ఇన్ఫెక్షన్ లేదా ముక్కు బ్లాక్ సమస్యల వల్ల కూడా ముఖం, కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. 

థైరాయిడ్ ఉన్నవారికి

హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ముఖం వాపు, అలసట, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

కిడ్నీ సమస్యలు

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో ద్రవాలు నిల్వ ఉండొచ్చు. దీంతో ముఖం, కళ్ల కింద వాపు కనిపించవచ్చు. ముఖ్యంగా ఇది తరచూ ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.

మద్యం, ధూమపానం 

ఆల్కహాల్ లేదా స్మోకింగ్ వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి ముఖం పఫ్‌గా కనిపించవచ్చు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే

ఈ సమస్యల వల్ల ముఖం ఉదయాన్నే ఉబ్బుతుంది. ఇలా రెగ్యులర్గా జరుగుతుంటే అస్సలు విస్మరించకూడదు. ముఖంలో వాపుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలర్జీ, జ్వరం, మూత్ర సమస్యలు లేదా శరీర వాపు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే సరిపడా నీళ్లు తాగడం, ఉప్పు తగ్గించడం, నిద్ర, అలర్జీ ట్రిగ్గర్స్కు దూరంగా ఉండడం వల్ల కూడా సమస్య అదుపులోకి వస్తుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget