అన్వేషించండి

Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

Beer and Breezer : బీర్‌, బ్రీజర్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఎక్కువ స్ట్రాంగ్‌? ఆల్కహాల్‌ శాతం, చక్కెరలు, క్యాలరీలు, ఆరోగ్యంపై ప్రభావాల గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీర్, బ్రీజర్ ఆల్కహాల్ శాతం దాదాపు సమానం; ABV చూడాలి.
  • బ్రీజర్ తీపి ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించదు, మోసపోకూడదు.
  • రెండు పానీయాలు ఆరోగ్యానికి హానికరం, మితంగా సేవించడం ముఖ్యం.

Beer vs Breezer Difference : బీర్‌ చేదుగా, బ్రీజర్‌ పండ్ల రుచితో తియ్యగా ఉంటుంది. అందుకే బ్రీజర్‌లో ఆల్కహాల్‌ తక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ ఈ రెండింటి గురించి పూర్తిగా తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారట. బ్రీజర్ గురించి చాలామంది అపోహల్లోనే ఉంటారట. మరి వీటి మధ్య తేడాలు ఏంటి? వేటిలో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది? ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

బీర్‌, బ్రీజర్‌ మధ్య తేడాలు

బీర్‌ను సాధారణంగా బార్లీ వంటి ధాన్యాల నుంచి తయారుచేస్తారు. ధాన్యాల్లోని షుగర్స్ ఈస్ట్‌ సాయంతో ఫెర్మెంటేషన్‌ జరగడం వల్ల ఆల్కహాల్‌ ఏర్పడుతుంది. బ్రీజర్‌ మాత్రం పండ్ల రుచులు కలిపిన ఆల్కహాలిక్‌ డ్రింక్‌. బకార్డీ బ్రీజర్‌ వంటి ఉత్పత్తుల్లో రమ్‌ ఆధారిత ఆల్కహాల్‌ ఉంటుంది. అందుకే రెండింటి రుచి, తయారీ విధానం వేర్వేరుగా ఉంటాయి.

Also Read : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి

బీర్‌, బ్రీజర్‌లో ఏది స్ట్రాంగ్‌?

సాధారణ బీర్‌లో ఆల్కహాల్‌ శాతం సుమారు 5 శాతం ఉండవచ్చు. బ్రీజర్‌లోనూ కొన్ని వేరియంట్లలో దాదాపు 4 నుంచి 5 శాతం వరకు ఆల్కహాల్ ఉండవచ్చు. కానీ స్ట్రాంగ్‌ బీర్‌లో ఆల్కహాల్‌ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి బీర్‌ ఎప్పుడూ బ్రీజర్‌ కంటే స్ట్రాంగ్‌ అని చెప్పలేం. ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే బాటిల్‌పై ఉన్న ABV (Alcohol By Volume) చూడాలి.

బ్రీజర్‌ తియ్యగా ఉంటే ఆల్కహాల్‌ ఎఫెక్ట్ తగ్గుతుందా?

బీర్‌తో పోలిస్తే బ్రీజర్‌లో పండ్ల రుచి, తీపి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ తీపి రుచి వల్ల ఆల్కహాల్‌ ప్రభావం తగ్గదు. అలాగే తాగుతున్నప్పుడు ఆల్కహాల్‌ రుచి అంతగా తెలియకపోవడంతో కొందరు వేగంగా లేదా ఎక్కువ పరిమాణంలో తాగే అవకాశం ఉంటుంది. అందుకే రుచిని బట్టి ఆల్కహాల్‌ పరిమాణాన్ని అంచనా వేయకూడదు.

Also Read : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

క్యాలరీల్లో తేడాలు

బీర్‌లో ఆల్కహాల్‌తో పాటు కార్బోహైడ్రేట్ల నుంచి కూడా క్యాలరీలు వస్తాయి. బ్రీజర్‌లో ఆల్కహాల్‌తో పాటు అదనపు చక్కెరలు ఉండే అవకాశం ఉంది. అయితే చక్కెర, క్యాలరీల పరిమాణం బ్రాండ్‌, ఫ్లేవర్‌, బాటిల్‌ పరిమాణాన్ని బట్టి మారుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవాల్సినవారు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. 

ఏది తాగితే త్వరగా మత్తు వస్తుంది?

బీర్‌ తాగినా, బ్రీజర్‌ తాగినా మత్తు రావడానికి ప్రధాన కారణం శరీరంలోకి వెళ్లిన ఆల్కహాల్‌ పరిమాణమే. పానీయంలోని ఆల్కహాల్‌ శాతం, తాగిన పరిమాణం, ఎంత వేగంగా తాగారు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. 

Also Read : బీర్​ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!

ఆరోగ్యానికి ఏది మంచిది?

బీర్‌ అయినా, బ్రీజర్‌ అయినా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనుకోకూడదు. ఆల్కహాల్‌ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు, ప్రమాదాలు, ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి బ్రీజర్‌ పండ్ల రుచితో ఉందని ఆరోగ్యకరమైనదని, బీర్‌ కంటే మంచిది అనుకోకూడదు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పానీయం ఏదైనా ఆల్కహాల్‌ శాతాన్ని, బాటిల్‌ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాత వాహనం నడపకూడదు. గర్భిణులు, గర్భం కోసం ప్రయత్నిస్తున్నవారు, కొన్ని మందులు వాడేవారు, ఆల్కహాల్‌తో సమస్యలు తీవ్రమయ్యే ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు తాగకపోవడమే మంచిది.

Also Read : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget