అన్వేషించండి

Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి

Storing Beer at Home : బీరు చల్లగా, రుచిగా ఉండాలంటే ఫ్రిడ్జ్​లో పెడితే సరిపోదు. దానిని ఎంత ఉష్ణోగ్రత, కాంత వద్ద ఉంచాలి? ఎలా పెడితే దాని నాణ్యత ప్రభావితం అవుతుందో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీరు నాణ్యతకు ఉష్ణోగ్రత, కాంతి, వేడి ముఖ్యమైనవి.
  • పదేపదే ఉష్ణోగ్రత మార్పులు బీరు రుచిని ప్రభావితం చేస్తాయి.
  • అధిక వేడి, ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి.
  • తాజాదనం కోసం చల్లని, స్థిరమైన ప్రదేశం ఎల్లప్పుడూ ఉత్తమం.

Beer Storing Tips : ఏదైనా పార్టీ కోసం.. లేదా మీ వీకెండ్ కోసం ముందుగానే బీర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటార చాలామంది. అయితే ఫ్రిడ్జ్​లో ప్లేస్​లేకపోతే.. దానిని కాసేపు గదిలో పెట్టి.. తర్వాత ఫ్రిడ్జ్​లో పెడదాములే అని ఆలేచిస్తారు. అయితే బీర్​ని చల్లగా ఉంచడం ముఖ్యమా? లేదా కాసేపు ఫ్రిడ్జ్​ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టవచ్చా.. అలా చేస్తే బీర్ పాడైపోతుందా? దాని తాజాదనాన్ని, రుచిని ప్రభావితం చేసే మిస్టేక్స్ ఏంటో చూసేద్దాం.

బీరును సరిగ్గా నిల్వ చేయడానికి, దానిని చల్లగా ఉంచితే మాత్రమే సరిపోదట. ఉష్ణోగ్రత, కాంతి, వేడి వంటి అంశాలు కూడా దాని నాణ్యతను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అందుకే మీరు బీరును ఇంట్లో కొంతకాలం స్టోర్ చేయాలని చూస్తుంటే.. దానిని ఎలా నిల్వ చేయాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

Also Read : బీర్​ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!

బీరును ఫ్రిడ్జ్​ బయట పెడితే..

ఫ్రిడ్జ్​లో పెట్టిన బీర్ బయటకు తీసిన తర్వాత కొంత సమయం బయట ఉంచితే అది గది ఉష్ణోగ్రతకు చేరుతుంది. అయితే అది తాగడానికి పనికిరాదని అర్థం కాదు. గది ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కూడా బీర్ సురక్షితంగానే ఉంటుంది. అయితే అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి గురి అయితే బీర్ నాణ్యత వేగంగా ప్రభావితం అవుతుంది.

బీర్‌ను పదేపదే వేర్వేరు ఉష్ణోగ్రతల్లో మార్చితే.. అప్పుడు రుచిలో మార్పు రావచ్చు. అంటే బీర్​ను ఫ్రిడ్జ్​లో పెట్టి.. ఆ తర్వాత బయటకు తీసి.. మళ్లీ రిఫ్రిజిరేటర్‌లో పెట్టవచ్చు. ఇలా ఎక్కువసార్లు జరిగితే బీర్ తాజాదనాన్ని క్రమంగా తగ్గుతుంది. 

ఉష్ణోగ్రత మార్పులు రుచిని ఎలా పాడు చేస్తాయి?

బీర్ వేడి, కాంతి, ఆక్సిజన్‌కు ప్రభావితమవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సీసా లేదా క్యాన్‌లోని రసాయన ప్రక్రియలను వేగవంతం చేసి.. క్రమంగా దాని రుచి, సువాసనను ప్రభావితం చేస్తాయి. అందుకే ఎక్కువసేపు వేడిలో ఉంచిన బీర్ అంతగా రుచించదు. లేదా పాతదిగా లేదా పాడైపోయినట్లుగా అనిపించవచ్చు. దాని సువాసన కూడా తగ్గిపోవచ్చు.

Also Read : బ్రో బ్రీజర్ సాఫ్ట్ డ్రింక్ కాదు ఆల్కహాల్ ఉంటుందట జాగ్రత్త.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

బీర్‌ను కొన్ని గంటలు బయట ఉంచితే దానికి పెద్దగా నష్టం జరగదు. అయితే పదేపదే వేడి బయట ఉంచడం, తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టడం లేదా ఎక్కువసేపు తీవ్రమైన వేడికి గురికావడం దాని నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా వేసవిలో, ఉష్ణోగ్రతలు పెరిగే గ్యారేజ్ లేదా ఇతర ప్రదేశాలలో బీర్‌ను బయట ఉంచితే ఈ తేడా ఈజీగా తెలుస్తుంది.

ఫ్రిజ్ బయట బీర్ ఎంతసేపు ఉంచవచ్చంటే..

బీర్లను గది ఉష్ణోగ్రత వద్ద కాసేపు ఉంచవచ్చు. ఈ కాల వ్యవధి బీర్ రకాన్ని బట్టి మారుతుంది. అయితే మీరు బీర్ రుచిని, తాజాదనాన్ని కాపాడుకోవాలనుకుంటే.. దానిని చల్లని, స్థిరమైన ప్రదేశంలో ఉంచడం బెస్ట్. రిఫ్రిజిరేటర్‌లో స్థలం పరిమితంగా ఉంటే.. బీర్‌ను చల్లని, చీకటి ప్రదేశంలో పెట్టండి. ప్రత్యక్ష సూర్యరశ్మి, గ్యాస్, ఓవెన్లు వంటి వాటికి దూరంగా ఉంచండి. 

Also Read : డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ ఎందుకు తాగకూడదో తెలుసా? తాగితే కలిగే అనర్థాలివే

ఉష్ణోగ్రత కూడా వివిధ రకాల బీర్లను ప్రభావితం చేస్తుంది. IPAల వంటి హాప్ రుచి ఎక్కువగా ఉండే బీర్లు ఉష్ణోగ్రత మార్పులకు మరింత సున్నితంగా ఉంటాయి. కాలక్రమేణా హాప్ సువాసన, రుచి వేగంగా తగ్గిపోవచ్చు. అందుకే ఈ బీర్లను చల్లగా ఉంచి, తాజాగా ఉన్నప్పుడే తాగడం ఉత్తమం. లైట్ బీర్లు, లాగర్‌లు కూడా ఫ్రిడ్జ్​లో పెడితే మంచిది. అయితే ఇవి IPAల కంటే ఉష్ణోగ్రత మార్పులను కొద్దిగా మెరుగ్గా తట్టుకోగలవు. స్టౌట్స్, కొన్ని బెల్జియన్ శైలి ఏల్స్ వంటి అధిక ఆల్కహాల్ శాతం ఉన్న బీర్లు స్థిరంగా ఉంటాయి. కొన్ని బీర్ల రుచి కాలక్రమేణా క్రమంగా మారడానికి వీలుగా.. చల్లని గది ఉష్ణోగ్రతలలో ఉంచుతారు.

ఫ్రిడ్జ్​లో బీరును ఎలా పెట్టాలంటే..

ఫ్రిడ్జ్​లో తగినంత స్థలం ఉంటే.. మీ బీర్‌ను చల్లగా, తాజాగా, రుచిగా ఉంచుకోవడానికి లోపల పెట్టేయండి. ఉష్ణోగ్రత ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనుకాని ప్రదేశంలో ఉంచాలి. అలాగే ఫ్రిడ్జ్​లో పెట్టిన సీసాలను లేదా క్యాన్‌లను పదేపదే బయటకు తీయడం మానేయాలి. ఒకవేళ బీర్‌ను రిఫ్రిజిరేటర్‌కు బయట ఉంచవలసి వస్తే.. చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచడం మంచిది. 

Also Read : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget