Lipstick: ఇంట్లోనే సులభంగా లిప్ స్టిక్ తయారు చేసుకోండిలా!
అనేక రకాల రంగులు, షేడ్స్ ఉన్న లిప్ స్టిక్స్ బయట బోలెడు దొరుకుతాయి. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాలు కొన్ని ప్రమాదకరం కావచ్చు. అందుకే ఇంట్లోనే సొంతంగా లిప్ స్టిక్ తయారు చేసుకోవచ్చు.
ఎర్రని పెదవులు అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అందుకే లిప్ స్టిక్స్ వేసుకుని తమ అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ వాటి వల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తరచూ లిప్ స్టిక్స్ వేసుకోవడం వల్ల అందులోని రసాయనాల వల్ల నల్లగా మారిపోతాయి. అందుకే మార్కెట్లో దొరికే వాటికి బదులుగా సొంతంగా ఇంట్లో లిప్ స్టిక్స్ తయారు చేసుకుని రాసుకుంటే చాలా మంచిది. ఇది పెదాలకు సహజమైన అందాన్ని ఇస్తుంది. ఈ పదార్థాలతో సింపుల్ గా ఇంట్లోనే లిప్ స్టిక్ తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- బీస్వాక్స్ లేదా సోయా మైనం
- కొబ్బరి నూనె లేదా బాదం నూనె
- షియా బటర్ లేదా కోకో బటర్
- కాస్మోటిక్ గ్రేడ్ రంగులు( మైకా పౌడర్ లేదా ఫుడ్ కలరింగ్)
- ఎసెన్షియల్ ఆయిల్స్ సువాసన కోసం
- డబుల్ బాయిలర్ లేదా మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్
- లిప్ స్టిక్ ట్యూబ్ లేదా చిన్న కంటైనర్
తయారీ విధానం
లిప్ స్టిక్ తయారీకి ఉపయోగించే అన్ని పరికరాలు, కంటైనర్ లు శుభ్రంగా ఉంచుకోవాలి. ముందుగా లిప్ స్టిక్ కి కావాల్సిన రంగుని నిర్ణయించుకోవాలి. అందుకోసం మైకా పౌడర్లు సహజ రంగు కోసం ఎంపిక చేసుకోవడం ఉత్తమం. డబుల్ బాయిలర్ లేదా మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్ తీసుకోవాలి. అందులో పదార్థాలు వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఒక స్పూన్ బీస్వాక్స్, ఒక భావం కొబ్బరి నూనె, ఈ టెబు స్పూన్ షియా బటర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలర్ లేదా మైక్రోవేవ్ లో అన్నీ పదార్థాలు కలిసి కరిగిపోయే వరకు మెత్తగా వేడి చేయాలి. దాన్ని మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి. మిశ్రమం పూర్తిగా కరిగే వరకు ఉంచాలి. అందులో కావాలంటే మైకా పౌడర్ లేదా కొన్ని చుక్కల ఫుడ్ కలర్ వంటి కాస్మోటిక్ గ్రేడ్ రంగులు జోడించుకోవచ్చు. రంగులు సమానంగా వచ్చే వరకు వాటిని బాగా కదిలించాలి.
లిప్ స్టిక్ మంచి సువాసన రావాలంటే కొన్ని చుక్కల సుగంధ నూనెలు వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. లావెండర్, పిప్పర్ మెంట్, సిట్రస్ నూనెలు వేసుకోవచ్చు. ఖచ్చితమైన కొలత కోసం పైపెట్ ని ఉపయోగించాలి. సువాసన రావాలంటే దాన్ని బాగా కలపాలి. లిప్ స్టిక్ ట్యూబ్ లేదా చిన్న కంటైనర్లలో మిశ్రమాన్ని జాగ్రత్తగా నింపాలి. లిప్ స్టిక్ గట్టి పడేందుకు పైభాగంలో కొద్దిగా ప్లేస్ ఉంచాలి.. దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అది గట్టిపడటం కోసం కంటైనర్లు ఫ్రిజ్ లో కూడా ఉంచుకోవచ్చు. గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత వాటి నుంచి తీసేసి లిప్ స్టిక్ వేసుకునే కంటైనర్ లో వేసుకోవచ్చు. లిప్ బ్రష్ లేదా ట్యూబ్ నుంచి నేరుగా పెదవులకు అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన లిప్ స్టిక్ నాణ్యత కాపాడుకోవడానికి దాన్ని సూర్యకాంతి కి దూరంగా ఉంచాలి. పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ప్రాణాంతకమైన థైరాయిడ్ స్టోర్మ్ గురించి తెలుసా? లక్షణాలు, చికిత్స ఏంటి?