అన్వేషించండి

Beauty Filter Glitch : లైవ్ స్ట్రీమ్​లో పోయిన బ్యూటీ ఫిల్టర్.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లను కోల్పోయిన ఇన్ఫ్లుయెన్సర్

Filter vs Reality : బ్యూటీ ఫిల్టర్ పనిచేయకపోవడంతో.. రియల్ ఫేస్ చూసిన ఆమె ఫాలోవర్లు సడెన్​గా అన్​ఫాలో చేశారు. ఈ ఘటన సోషల్ మీడియా కేవలం బ్యూటీకే అట్రాక్ట్ అవుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చింది.

Streamer’s Real Face Revealed After Filter Glitch : సోషల్ మీడియాలోని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎప్పటిలానే లైవ్-స్ట్రీమ్ చేసింది. అదే సమయంలో బ్యూటీ ఫిల్టర్ విఫలమవడంతో.. ఆమె అసలు ముఖం కాసేపు కనిపించింది. ఆమె ముఖాన్ని చూసిన ఫాలోవర్లు.. ఒక్కసారిగా ఆమెను అన్​ఫాలో చేశారు. ప్రస్తుతం స్ట్రీమ్ నుంచి తీసిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఫిల్టర్లు, ఆన్‌లైన్ అందాల ప్రమాణాలు, నిజాయితీ గురించిన చర్చకు దారితీసింది. కొందరు ఆమెను విమర్శించగా.. మరికొందరు ఆమెను సమర్థించారు. ఫిల్టర్ లేకుండానే బాగుందంటూ చెప్పారు. కానీ ఆలోపే ఆమె లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్​లు వైరల్ అయ్యాయి. 

లైవ్ స్ట్రీమ్​లో బ్యూటీ ఫిల్టర్ ఫెయిల్ కావడంతో

ఈ వైరల్ క్లిప్ దాదాపు నాలుగు సెకన్ల నిడివితో ఉంది. ఒక చైనీస్ లైవ్-స్ట్రీమర్ తన బెడ్‌రూమ్ నుంచి స్ట్రీమ్ చేస్తోంది. ఆమె వెనుక మృదువైన లైటింగ్, పూల హెడ్‌బోర్డ్ ఉన్నాయి. అలాగే ఆమెకు పొడవాటి నల్లటి జుట్టు ఉంది. ఊదా రంగు స్ట్రాప్‌లెస్ టాప్ ధరించింది. బంగారు  ఆభరణాలు కూడా ధరించింది.

స్ట్రీమ్ మధ్యలో బ్యూటీ ఫిల్టర్ కాసేపు పనిచేయడం ఆగిపోయింది. ఆమె ముఖం సహజ చర్మ ఆకృతి, చర్మపు రంగులో కనిపించింది. కొన్ని సెకన్ల తరువాత మళ్లీ ఫిల్టర్ వచ్చింది. ఆ ఫిల్టర్​లో ఆమె లేత, మృదువైన, బొమ్మలాంటి రూపాన్ని ఇస్తుంది. పెద్ద కళ్లు, జా లైన్ అన్ని బాగా ఉన్నాయి. లోపం సమయంలో ఆమె తన జుట్టును సర్దుబాటు చేసి.. ఫిల్టర్ రాగానే కొద్దిగా నవ్వి ఎప్పటిలాగే స్ట్రీమ్‌ను కొనసాగించింది. అయితే ఆ స్ట్రీమర్ గురించి ఇంకా ఎవరికి తెలియదు. 

ప్రస్తుతం ఈ వీడియో X, Instagramలో బాగా వైరల్ అయింది. ఫిల్టర్ విఫలమైన వెంటనే ఆమె దాదాపు 1.4 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందని పోస్ట్​లు షేర్ చేశారు. ఈ వాదన ఆమె ధృవీకరించలేదు కానీ.. వినియోగదారుని కంటెంట్‌ బ్యూటీపై మాత్రమే ఆధారపడి ఉందనే చర్చకు తీసుకువచ్చింది. 

లైవ్ స్ట్రీమింగ్ చైనాలో ఒక ప్రధాన పరిశ్రమ. ముఖ్యంగా టిక్‌టాక్ చైనా వెర్షన్ అని తరచుగా వర్ణించే డోయిన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో.. స్ట్రీమర్‌లు గంటల తరబడి లైవ్ చేస్తారు. వీక్షకులతో చాట్ చేస్తారు. పాటలు పాడతారు. డ్యాన్స్ చేస్తారు. అలాగే ప్రొడెక్ట్స్ అమ్ముతారు. ఆదాయం ప్రధానంగా అభిమానులు పంపే వర్చువల్ బహుమతుల నుంచి వస్తుంది. వీటిని నిజమైన డబ్బుతో కొనుగోలు చేస్తారు. వ్యూయర్స్​ను ఆకర్షించడంలో క్రియేటర్ లుక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది చర్మాన్ని మృదువుగా చేసే, కళ్లను పెద్దదిగా చేసే బ్యూటీ ఫిల్టర్‌లు వాడుతారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget