Heart Attack: ఇలా స్నానం చేయడం వల్ల అకస్మాత్తుగా గుండె పోటు వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
గుండె పోటు రావడానికి మనకు తెలిసిన కారణాలే కాదు, తెలియని కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి.
గుండెపోటు ఎప్పుడు వస్తుంది? గుండె కండరాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండె పోటు వస్తుంది. ధమనుల్లో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడిప్పుడు లేదా చాలా నెమ్మదిగా సరఫరా అయినప్పుడు కూడా గుండె పోటు రావచ్చు. రక్తం గడ్డకట్టం వల్ల కూడా ఇలా అవుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యక్తి వయసు, కుటుంబచరిత్ర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం ఇలా అనేక రకాలైన కారకాలు గుండెపోటుకు దారితీస్తాయి. అలాగే కొన్ని జీవనశైలి కారకాలు కూడా గుండెపై ఆకస్మికంగా ఒత్తిడిని కలిగింది పోటు వచ్చేలా చేస్తాయి. అందులో ఒకటి ‘చల్లటినీటితో చేసే స్నానం’.
ఇలా చేస్తే ప్రమాదం
గుండె వైద్యుల అభిప్రాయం ప్రకారం చల్లటి నీటిని ఒకేసారి శరీరంపై పోసుకోవడం వల్ల ఒక్కోసారి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి మరీ ప్రమాదం. ఇలా చేయడం వల్ల గుండె పోటు లేదా గుండె లయ తప్పడం వంటి సమస్యలకు కారణం కావచ్చు. చల్లటినీరు శరీరాన్ని షాక్‌కు గురిచేస్తుంది. దీని వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి, శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె వేగంగా కొట్టుకుంటూ పనిచేయాల్సి వస్తుంది. ఇది రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఏ వయసు వారైనా?
చిన్న వయసులో ఉన్న వారు, యువత తమకేమీ కాదులే అనుకుంటారు. కానీ ఎంత ఫిట్ గా ఉన్నవారైనా చల్లటి వాతావరణంలో చల్లటి నీటిని స్నానంగా పోసుకోవడం వల్ల రక్తనాళాలు సంకోచించి గుండెపోటు వచ్చేలా చేస్తాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలోనే ఎక్కువ మంది చల్లటినీటిని స్నానంగా చేసేందుకు ఇష్టపడతారు. అప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
ఒక అధ్యయనంలో ఇలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కోల్డ్ షాక్ రెస్పాన్స్ అని పిలిచే న్యూరోజెనిక్ కార్డియో రెస్పిరేటరీ సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ఊపిరిపీల్చుకోవడం, హైపర్ వెంటిలేషన్, శ్వాసఆడకపోవడం, మానసిక ఆందోళలను పెంచుతుంది. గుండె లయను మార్చి, గుండె పోటుకు దారితీస్తుంది.
ఇలా చేయండి...
మీకు చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సిన పరిస్థితులు ఉంటే ఒకేసారి మగ్ తో నీళ్లు ఒంటి మీద పోసుకోవద్దు. ముందుగా కాళ్లు, చేతులు తడుపుకోండి. అలా కాసేపు చేయడం వల్ల శరీరం ఆ ఉష్ణోగ్రతను స్వీకరించి మార్పులు చేసేందుకు సమయం చిక్కుతుంది. కాబట్టి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
Also read: రణవీర్ సింగ్ నగ్నంగా పడుకున్న ఆ రగ్గు ఖరీదెంతో తెలుసా? దాని స్పెషాలిటీ ఇదే
Also read: ఈ పాపని చూస్తుంటే ఐన్‌స్టీన్ మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందా? నిజానికి ఈ పాపదో అరుదైన వ్యాధి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.