(Source: ECI/ABP News/ABP Majha)
Hair Syndrome: ఈ పాపని చూస్తుంటే ఐన్‌స్టీన్ మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందా? నిజానికి ఈ పాపదో అరుదైన వ్యాధి
పాప జుట్టు చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తోంది కదా, అదే ఆమెను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిపింది.
ఆ పాప జుట్టును దువ్వడానికి ప్రయత్నించినా, క్రాఫ్ తీసేందుకు ట్రై చేసినా ఫలితం ఉండదు. ఆ జుట్టు అలా నిక్కబొడిచిటనట్టే ఉంటుంది. వాళ్లమ్మ మొదట్లో జుట్టును నున్నగా దువ్వి పాపిట తీసేందుకు ప్రయత్నించింది, కానీ కుదరలేదు. వెంట్రుకలు చూసేందుకు వింతగా ఉండడంతో వైద్యులను సంప్రదించారు. ఆయన కొన్ని పరీక్షలు చేశాక ఆ పాపకి ‘అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్’ ఉన్నట్టు తేల్చారు. ప్రపంచంలో కేవలం వందమందికి మాత్రమే ఈ సమస్య ఉంది. అందులో ఈ పాప ఒకరు. ఈ చిట్టి తల్లి పేరు లైలా డేవిస్.గతంలో డేవిడ్ అనే పిల్లాడికి కూడా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్టు బయటపడింది.
రాక్ స్టార్...
లైలాను రాక్ స్టార్‌లా ఉంటుంది. తమ కూతురికి అరదైన వ్యాధి ఉందని తెలుసుకున్న కొత్తలో ఆమె తల్లిదండ్రులు బాధపడ్డారు. తరువాత మాత్రం తమ పాప పుట్టుకతోనే రాక్ స్టార్ అంటూ తమకు తామే ధైర్యం చెప్పుకుని, పాపను అల్లారు ముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆమె ఫోటోలను ఇన్ స్టా పోస్టు చేసి సోషల్ మీడియా స్థార్ ను చేశారు. లైలాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
View this post on Instagram
Also read: రణ్‌వీర్ సింగ్ పడుకున్న ఆ రగ్గు ఖరీదెంతో తెలుసా? దాని స్పెషాలిటీ ఇదే
ఏంటి ఈ వ్యాధి?
అన్‌కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (UHS) వింతైన వెంట్రుకల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వెంట్రుకలు ఒంగడానికి ఇష్టపడకుండా నిటారుగా నిల్చుంటాయి. రంగు కూడా చాలా తెల్లగా ఉంటాయి. ఈ వ్యాధితో పుట్టిన వారిలో మూడు నెలల నుంచి 12 ఏళ్ల మధ్య ఈ వ్యాధి బయటపడుతుంది. లైలాను చూసిన వారు ఐన్‌స్టీన్ ను గుర్తు చేసుకుంటారు. ఈ వ్యాధి వల్ల జుట్టు అలా నిక్కబొడిచినట్టు కనిపించడం తప్ప ఇతర బాధలేవీ ఉండవు.
Also read: ఈ మొక్కను బాల్కనీలో పెంచుకుంటే దోమలు పరార్
ఇన్ స్టాలో లైలాకు 48 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. లైలా తనను ఎందుకు అంత స్పెషల్ గా ప్రజలు చూస్తున్నారో అర్థం చేసుకునే వయసులో కూడా లేదు. పెద్దయ్యాక ఆమె కచ్చితంగా తానెంత ప్రత్యేకం అని ఫీలవ్వడం ఖాయం అంటోంది ఆ చిన్నారి తల్లి షార్లెట్.
View this post on Instagram