Mosquito Repellent: ఈ మొక్కను బాల్కనీలో పెంచుకుంటే దోమలు పరార్
దోమలు మోసుకొచ్చే వ్యాధులు ఇన్నీ అన్నీ కావు.వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వానాకాలం వచ్చిందంటే దోమలు చెలరేగిపోతాయి. మలేరియా నుంచి డెంగీ వరకు అనేక రోగాలను వ్యాప్తి చెందిస్తాయి. వానాకాలంలో అవి గుడ్లుపెట్టేందుకు మురుగునీరు అధికంగా దొరుకుతుంది. అందుకే అవి ఆ కాలంలో విపరీతంగా సంఖ్యను పెంచుకుంటాయి. ఇంట్లోకి చేరిన ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చి రోగాలను వ్యాపించేలా చేస్తాయి. వాటి కోసం రసాయనాలున్న మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా దీర్ఘకాలంలో చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లోని గాలిలో రసాయన స్ప్రేలు వెదజల్లడం పిల్లలకు, ముసలి వాళ్లకు మంచిది కాదు. అందుకే సహజమైన పద్ధతుల్లో దోమలు ఇంట్లో చేరకుండా అడ్డుకోవాలి. అందుకు గ్రీన్ టీ మొక్క ఉపయోగపడుతుంది.
అద్భుతాల మొక్క
గ్రీన్ టీ మొక్క నుంచి వచ్చే వాసన దోమలకు పడదు. వాటి ఆరోగ్యానికి ఈ వాసన హానికరం. ఇంటి వెలుపల, తలుపు బయట ఈ మొక్కలను పెట్టుకుంటే దోమలు ఇంట్లోకి అడుగుపెట్టవు. ఇవే కాదు తేనెటీగలు కూడా ఈ మొక్కల వాసనను అసహ్యించుకుంటాయి. ఇంట్లో దోమలు మరీ వేధిస్తుంటే గ్రీన్ టీ ఆకులను కుప్పలా పోసి కాల్చిస్తే ఆ పొగకు మూలమూలన దాక్కున్న దోమలు కూడా పారిపోతాయి.
ఆయింట్మెంట్‌గా...
మార్కెట్లో దోమలను వికర్షించే ఎన్నో క్రీములు ఉన్నాయి. వాటిలో రసాయనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి బదులు గ్రీన్ టీ ఆకులను మెత్తని పేస్టులా చేసి శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు. మీ చుట్టుపక్కల తిరిగేందుకు కూడా భయపడతాయి.
గ్రీన్ టీ బ్యాగులు
వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను పడేసే కన్నా ఇంటి మూలల్లో పెడితే మంచిది. దోమలు ఆ ప్రదేశాలను విడిచి బయటికి పోతాయి. లేదా గ్రీన్ టీ బ్యాగుల్లోని పొడిని కాల్చినా కూడా ఆ పొగకు దోమలు పరారవుతాయి.
పసుపుపొడితో...
వాడేసిన గ్రీన్ టీ బ్యాగుల్లోని పొడిని,పసుపుతో కలిపి మరింత మెత్తటి పొడిలా చేసి, నీటిలో కలిపి ఇంటి మూలల్లో చల్లడం వల్ల కూడా దోమలు పారిపోతాయి. మీ ఇంటి వైపు కూడా చూడదు.
Also read: మంకీపాక్స్ మూడు కొత్త లక్షణాలు ఇవి, వీటిని తీవ్రమైనవిగా గుర్తించిన పరిశోధకులు
Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.