అన్వేషించండి

Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

Babymoon Travel Guide : బేబీమూన్ అనే ట్రావెల్ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ప్రాచూర్యం పొందుతుంది. దీని గురించిన పూర్తి డిటైల్స్, ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బేబీమూన్ అనేది బిడ్డ రాకముందు దంపతుల విశ్రాంతి యాత్ర.
  • రెండవ త్రైమాసికం అనుకూల సమయం, వైద్యుని సలహా ముఖ్యం.
  • ప్రశాంత వాతావరణం, సురక్షిత ప్రదేశాలు, వైద్య సౌకర్యాలు ఎంచుకోవాలి.
  • అవసరమైన మందులు, వైద్య నివేదికలు వెంట తీసుకెళ్లడం ముఖ్యం.

Best Time For Babymoon : ప్రెగ్నెన్సీ తర్వాత దంపతుల జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆసుపత్రి చెకప్‌లు, పుట్టబోయే బిడ్డ, తల్లికోసం కోసం షాపింగ్, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ బాధ్యతలు.. ఇలా అనేక పనులతో సమయం గడిచిపోతుంది. ఇలాంటి సమయంలో బిడ్డ పుట్టకముందే ఇద్దరూ కలిసి ప్రశాంతంగా కొంత సమయం గడపాలనే ఉద్దేశంతో కొన్ని జంటలు ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అలా వెళ్లే స్పెషల్ విహారయాత్రనే 'బేబీమూన్' అంటారు. విదేశాల్లో చాలా కాలంగా ఉన్న ఈ ట్రెండ్​ను ఇప్పుడు ఇండియాలో కూడా చాలా జంటలు ఫాలో అవుతున్నాయి. 

బేబీమూన్


Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

బిడ్డ పుట్టక ముందే.. కాబోయే తల్లిదండ్రులు కలిసి విశ్రాంతి తీసుకునేందుకు, ప్రశాంతంగా కొన్ని రోజులు గడపడానికి చేసే చిన్న ట్రిప్​ని బేబీమూన్ అంటారు. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు.. తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడపడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, బంధాన్ని మరింత బలపరచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెప్తారు.

Also Read : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..

బేబీమూన్‌కు సరైన సమయం 

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీలో రెండో త్రైమాసికం అంటే 14 నుంచి 28 వారాల మధ్య ఈ బేబీమూన్‌ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకుంటే ఈ దశలో తొలి నెలల్లో ఉండే వికారం, అలసట తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చివరి నెలల్లో ఉండే అసౌకర్యం కూడా అంతగా ఉండదు కాబట్టి.. ఇదే అనుకూలమైన సమయం. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేయాలా వద్దా అనేది వైద్యుడి సలహా మేరకే డిసైడ్ అవ్వాలి. 

బేబీమూన్‌కు వెళ్తే కలిగే లాభాలు


Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా ట్రిప్​కి వెళ్లడం వల్ల దంపతులకు ఒకరితో ఒకరు ప్రశాంతంగా సమయం గడిపే అవకాశం లభిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడి, ఆందోళన కొంతవరకు తగ్గవచ్చు. తల్లిదండ్రులుగా రాబోయే బాధ్యతలకు ఇద్దరూ కలిసి మానసికంగా సిద్ధమవుతారు. ప్రకృతి మధ్య గడపడం వల్ల విశ్రాంతి, సానుకూల భావనలు పెరుగుతాయి. బిడ్డ రాకముందే, బిడ్డతో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోవచ్చు. 

Also Read : ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నారా? సంతాన్నాన్ని దూరం చేస్తోన్న అలవాట్లు ఇవే

ఎలాంటి ప్రదేశాలకి వెళ్తే మంచిది?

బేబీమూన్ కోసం దూర ప్రాంతాల కంటే సమీపంలో ఉండే, ప్రశాంతమైన ప్రదేశాలను ఎంచుకోవడం మంచిది. అవసరమైతే ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ ప్రయాణం చేయాల్సిన ప్రదేశాలు లేదా రోజంతా తిరిగే టూర్ ప్లాన్‌లను చేసుకోకూడదు. 

దోమల ద్వారా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉన్న ప్లేస్​లు, అధిక ఎత్తులో ఉండే లోకేషన్లు, తీవ్రమైన వేడి లేదా చలితో కూడిన ప్రాంతాలు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో లేని చోట్లకి వెళ్లకూడదు.

బేబీమూన్​కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

మీరు బేబీమూన్​కి వెళ్లాలనుకుంటే వైద్యులు సూచించిన మందులు తీసుకెళ్లాలి. అలాగే గర్భధారణ విటమిన్లు, మెడికల్ రిపోర్ట్స్, సౌకర్యవంతమైన డ్రెస్​లు, పాదాలకు మద్దతు ఇచ్చే చెప్పులు, తేలికపాటి హెల్తీ ఫుడ్స్, తగినంత మంచినీరు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, శరీరాన్ని స్ట్రెచ్ చేయడం మంచిది.

ప్రెగ్నెన్సీ గురించిన మరిన్ని హెల్త్ టిప్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget