Baby Born with Tail: పొడవైన తోకతో పుట్టిన శిశువు.. చివరిలో బంతిలాంటి భాగం
మనుషులకు కూడా తోకలుంటాయి. పిండంగా ఉన్నప్పుడు తోక ఉంటుంది. మరి పెద్దయ్యాక అది శరీరంలో కలిసిపోతుంది. అలా కాకపోతే ఏం జరుగుతుందో తెలిపిందుకు ఈ శిశువే నిదర్శనం.
![Baby Born with Tail: పొడవైన తోకతో పుట్టిన శిశువు.. చివరిలో బంతిలాంటి భాగం Baby born in Brazil had 12-cm-long Tail with ball-shaped mass at the tip Baby Born with Tail: పొడవైన తోకతో పుట్టిన శిశువు.. చివరిలో బంతిలాంటి భాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/06/ef415ccf6363153c66be96110e5d454b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బ్రెజిల్‌లోని ఫోర్టలేజా నగరంలో గల ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఓ శిశువు వింత తోకతో జన్మించాడు. తోక చివర్లో గుండ్రంగా బంతిలాంటి భాగాన్ని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. అయినా.. మనిషికి తోకేంటీ? అది జంతువులకు కదా ఉండాలనే సందేహంపై వైద్యులు ఈ విధంగా స్పందించారు.
శిశువు తోక 12 సెంటీమీటర్లు ఉంది. వాస్తవానికి శిశువు కడుపులో ఉన్నప్పుడే తోక ఏర్పడుతుంది. అది ప్రతి ఒక్కరిలో సహజం. ఈ శిశువుకు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తోక ఉంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణ సమయంలో కడుపులో ఉండే పిండానికి తోక ఏర్పడుతుంది. పిండం పెరిగి శిశువుగా మారే సమయానికి అది శరీరంలో కలిసిపోతుంది. చివరికి అక్కడ తోక ఎముక ఏర్పడుతుంది. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఈ శిశువు విషయంలో అలా జరగలేదు. ఆ తోక శరీరంలో కలవలేదు. పైగా అతడితోపాటే పెరిగి పెద్దదైంది.
Also Read: ‘నిధివన్’ మిస్టరీ.. ఈ ఆలయంలో రాత్రి మంచాన్ని అలంకరిస్తారు.. ఉదయానికి అంతా చెల్లాచెదురు..
‘జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ’ కేస్ రిపోర్ట్స్‌లో ఈ అరుదైన ఘటన గురించి వివరించారు. తోక చివర బంతి ఆకారం ఎలా ఏర్పడిందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు.. శిశువు గర్భంలో ఉన్నప్పుడే దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారనే విషయం మీదా వివరణ ఇవ్వలేదు. శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీయడానికి ముందు నిర్వహించిన అల్ట్రాసౌండ్‌లో సైతం ఈ తోక కనిపించలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. శిశువు తోక చివరి ఉన్న బంతి వ్యాసం 4 సెంటీ మీటర్లు ఉంది. వైద్యులు ఈ తోకను ‘చైన్ అండ్ బాల్’గా అభివర్ణిస్తున్నారు. శస్త్ర చికిత్సతో వైద్యులు ఆ తోకను విజయవంతంగా తొలగించారు. తోకను తొలగించిన తర్వాత శిశువును కొద్ది రోజులు హాస్పిటల్‌లోనే ఉంచారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని శిశువు తల్లిదండ్రులు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)