Rainy Season Health Tips : వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఆయుర్వేద చిట్కాలివే.. ఇమ్యూనిటీని పెంచుకోండిలా
Ayurveda Tips for the Monsoon : వర్షాకాలంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా, రోగనిరోధక శక్తితో ఉండటానికి ఆయుర్వేద చిట్కాలు పాటించండి. ఈ వర్షాకాలంలో ప్రకృతి వైద్యం అలవర్చుకోండి.

Monsoon Ayurveda Tips : వర్షాకాలంలో ఎండల నుంచి ఉపశమనం ఉంటుంది. కానీ గాలిలోని తేమ జీర్ణశక్తిని (అగ్ని) అణిచివేస్తుంది. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. శరీరాన్ని అసమతుల్యతకు గురి చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలం అనేది శరీరంలోని అంతర్గత సమతుల్యతలు ఎక్కువగా వచ్చే సమయంగా చెప్తారు. అయితే శరీరానికి లోపలి నుంచి పోషణ అందిస్తూ.. శుభ్రపరచడానికి, రీసెట్ చేయడానికి హెల్ప్ చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే శరీరం సమస్యలను ఇవి తేలిగ్గా తగ్గిస్తాయి. అజీర్ణం, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు దూరమవుతాయి.
డైట్లో తీసుకోవాల్సిన ఫుడ్స్
(Image Source: Canva)
వర్షాకాలంలో వెచ్చగా, తాజాగా తయారుచేసిన ఫుడ్ తింటే మంచిది. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీలకర్ర, అల్లం, పసుపు వంటి మసాలా దినుసులతో కిచిడిని చేసుకుని తింటే మంచిది. వాము, మిరియాలు, ఇంగువ వంటి మసాలా దినుసులు కూడా జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. కాబట్టి అలాంటి మసాలా దినుసులతో వంటలు చేసుకోవచ్చు. అలాగే నీటి ద్వారా వచ్చే వ్యాధులను దూరం చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. వండని సలాడ్లు, పాల ఉత్పత్తులను వీలైనంత వరకు తినకపోవడమే మంచిది. ఉడికించిన కూరగాయలు, హెర్బల్ టీలు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే సూప్‌లను తీసుకోవాలి.
హెర్బల్ డ్రింక్స్
ఒక కప్పు వెచ్చని అల్లం-తులసి టీ తాగితే వర్షాకాలంలో వచ్చే రోగాలు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. దాల్చిన చెక్క, సోంపు, యాలకులతో తయారుచేసిన హెర్బల్ టీలను తీసుకుంటే పేగుల్లోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె, పసుపు కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
హైడ్రేషన్ ముఖ్యం. కానీ చల్లటి నీరు, శీతల పానీయాలు తీసుకోకపోవడమే మంచిది. బదులుగా జీర్ణక్రియకు హెల్ప్ చేసి.. శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపే గోరువెచ్చని నీటిని తాగవచ్చు.
నూనెతో మసాజ్
వర్షాకాలంలో తలకే కాదు శరీరానికి కూడా నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. ఔషధ నూనెలను కాస్త గోరువెచ్చగా చేసుకుని.. మసాజ్ చేసుకోవచ్చు. అనంతరం స్నానం చేయవచ్చు. వర్షాకాలంలో వేప లేదా నువ్వుల నూనెను శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల వాతం తగ్గుతుంది. ఇది శరీరాన్ని శాంతపరచడమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఉదయం పూట కేవలం 15 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. మంచి నిద్ర వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది.
నిద్ర ఉండాల్సిందే..
జీవనశైలిలో భాగంగా చాలామంది నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వర్షాకాలంలో.. మీ షెడ్యూల్‌ను నిద్రతో బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. తెల్లవారుజామున నిద్ర లేవండి. పగటిపూట నిద్రపోకండి. రాత్రి 10 గంటలలోపు నిద్రపోండి. నిద్రను సాధారణంగా తక్కువగా అంచనా వేస్తారు. ఇది శరీరం సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల శరీరం రీసెట్ అవుతుంది.
మూలికలు తీసుకుంటే..
(Image Source: Canva)
అశ్వగంధ లేదా గుడుచి వంటి మూలికలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల బలం, శక్తి, రోగనిరోధక శక్తికి కారణమయ్యే శక్తిని అభివృద్ధి చేస్తాయి. మీ శరీర రకానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడానికి నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.






















