అన్వేషించండి

Disposable Glass: డిస్పోజబుల్ కప్పుల్లో నీరు, టీ, కాఫీలు తాగడం మానేయండి - క్యాన్సర్ ముప్పు ఎక్కువ

ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్పోజబుల్ గ్లాసులే కనిపిస్తున్నాయి.

ఆధునిక కాలంలో డిస్పోజబుల్ కప్పుల వినియోగం పెరిగింది. వాటిని ఒకసారి వాడి పడేయవచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని ఆఫీసుల్లో, హోటల్స్ లో వీటి వినియోగం అధికంగా ఉంది. కానీ ఇలాంటి డిస్పోజబుల్ గ్లాసులను వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలగక తప్పదు. దీర్ఘ కాలంగా ఇలాంటి డిస్పోజబుల్ గ్లాసులు వాడే వారిలో క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఒకప్పుడు స్టీలు గ్లాసులు మాత్రమే ఉండేవి. అలాగే మట్టి పాత్రలో కూడా తినేవారు, తాగేవారు. ఇప్పుడు అనేక రకాల మెటీరియల్స్ తో తయారు చేసే గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో అన్నిటికంటా తక్కువ ధరకే డిస్పోజబుల్ గ్లాసులు లభిస్తున్నాయి. వీటిని ప్లాస్టిక్, కాగితం వంటి వాటితో తయారు చేస్తారు. వీటి తయారీలో అనేక రసాయనాలను కూడా కలుపుతారు. అందుకే వీటిని దీర్ఘకాలంగా వాడటం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.

పరిశోధనకర్తలు చెబుతున్న ప్రకారం డిస్పోజబుల్ గ్లాసుల్లో బిస్ ఫినాల్, బిపిఏ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిల్లో వేడి వేడి టీ లేదా కాఫీలు తాగినప్పుడు ఈ రసాయనాలు వాటిలో కరిగిపోయే అవకాశం ఉంది. ఈ రసాయనాలు టీ, కాఫీల ద్వారా పొట్టలోకి ప్రవేశించి అక్కడ అనేక మార్పులకు కారణం అవుతాయి. దీర్ఘకాలంగా ఇలా తాగే వారిలో క్యాన్సర్ కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి డిస్పోజబుల్ గ్లాసులు, కప్పుల్లో తాగడాన్ని తగ్గించుకోవాలి. ఈ కప్పుల తయారీలో వాడే బిపిఏ అనే రసాయనం చాలా ప్రమాదకరమైనది. దీనివల్లే ఏటా అనేక రకాల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.

డిస్పోజబుల్ కప్పుల్లో రసాయనాలతో పాటు మైక్రో ప్లాస్టిక్‌లు కూడా ఉంటాయి. ఈ మైక్రో ప్లాస్టిక్‌లు శరీరంలో చేరితే క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా కూడా ఈ క్యాన్సర్ కణితులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్పుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. వీటితో పోలిస్తే కాగితం కప్పులు వాడడం చాలా ఉత్తమం. నిజానికి ఇలాంటి డిస్పోజబుల్ గ్లాసులు పూర్తిగా వాడకూడదనే చెబుతున్నారు వైద్యనిపుణులు. స్టీలు కప్పుల్లో తాగడం లేదా మట్టి కప్పులను వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంది. వీటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదు. కానీ వీటిని హోటల్స్, ఆఫీసుల్లో వాడడం లేదు. డిస్పోజబుల్ గ్లాసులు వాడేందుకు ఎక్కువ ఇష్టత చూపిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

Also read: ఇలాంటి పనులు చేస్తే మైగ్రేన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది, జాగ్రత్త

Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget