Listening Music: ఒత్తిడిని అధిగమించలేకపోతున్నారా? ఇదిగో మ్యూజిక్ పరిష్కారం
మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, బాధగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనకి తోడుగా స్నేహంగా ఉండేది సంగీతం. మనం ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నా మంచి పాట వింటే చాలు మనసుకి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది.
సంగీతం సర్వరోగ నివారిణి అంటారు. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, బాధగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనకి తోడుగా స్నేహంగా ఉండేది సంగీతం. మనం ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నా మంచి పాట వింటే చాలు మనసుకి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణంలో ఉన్నప్పుడు చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని తమకి నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరూ మ్యూజిక్ ని ఆస్వాదిస్తారు. మనసుకి నచ్చిన సంగీతం వింటుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడొచ్చు. సంగీతం మనల్ని మానసికంగా, శారీరకంగా ప్రశాంతనిస్తూ భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మ్యూజిక్ ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అందులో ఉండే మాధుర్యం మరెందులోనూ ఉండదు. మ్యూజిక్ వినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
* మ్యూజిక్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం. మంచి సంగీతం వినడం వల్ల మెదడును ఉత్తేజపరుస్తుంది.
* జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పాటలు విన్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని హమ్ చేస్తూ ఉంటాం. మెదడు చురుగ్గా ఉండటం వల్ల విషయాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయని అంటారు. కొన్ని జబ్బులకి మ్యూజిక్ గొప్ప ఔషధంగా పని చేస్తుంది. అందుకే కొంతమందికి మ్యూజిక్ థెరపీ పేరిట వైద్యం చేస్తారు.
* ఆందోళన, ఆతృత నుంచి బయటపడేందుకు సంగీతం సహకరిస్తుంది. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న సమయంలో హాయిగా మంచి సంగీతం వింటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
* వ్యాయామం చేసేప్పుడు సంగీతం వింటారు. అలా చెయ్యడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. అలసట అనే భావన లేకుండా వ్యాయామం చెయ్యగలుగుతారు. బరువు తగ్గేందుకు సంగీతం కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. జుంబా ద్వారా బరువు తగ్గించే సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి చాలా ఫేమస్ అయ్యాయి కూడా. చక్కని సంగీతం వింటూ అందుకు తగిన విధంగా కాలు కదుపుతూ సులువుగా బరువు తగ్గొచ్చు.
* సంగీతం ఇద్దరి అభిప్రాయాలను, అభిరుచులని కలుపుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడేందుకు సంగీతం బాగా ఉపయోగపడుతుంది.
Also Read: స్విమ్మింగ్ చేస్తే ఇన్ని లాభాలా? ఇంకెందుకు ఆలస్యం మీరు ఈత కొట్టేయండి మరి
Also read: గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? అండం విడుదలయ్యే రోజేదో ఇలా తెలుసుకుంటే, గర్భం ధరించడం సులువు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.