Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది
కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కువగా భుజం నొప్పితో బాధపడుతూ ఉంటారు.
ఎటువంటి బరువులు ఎత్తకపోయినా కూడా భుజాల మీద ఏదో బరువుగా అనిపిస్తుంది. మెడ, వీపు పై భాగంలో నొప్పి కలిగిస్తుంది. ఇది రోజువారీ కార్యకలపాలని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, టెన్షన్, సరైన భంగిమలో నిద్రపోవడం, గాయాలు వంటి కారణాల వల్ల భుజాలు బిగుతుగా అనిపిస్తాయి. ఒత్తిడి లేదా ఆందోళనని ఎదుర్కొంటున్నప్పుడు కండరాలు సంకోచిస్తాయి. నిరంతరం భుజాలు ఎత్తడం వల్ల నొప్పి వస్తుంది. దీన్ని అధిగమించడానికి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బిగుతుగా ఉండే భుజాల నుంచి ఉపశమనం పొందటం కోసం స్ట్రెచింగ్ లేదా యోగా చేసుకోవచ్చు.
⦿భుజాన్ని రోల్ మాదిరిగా అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి
⦿చెవి నుంచి భుజాన్ని పక్కకు తిప్పుతూ ఉండాలి
⦿నిలబడి చేతులు ముందుకు వెనుకకు ఊపాలి
⦿సూదిలో దారం ఎక్కించేందుకు ప్రయత్నించండి
భుజాలు క్రమం తప్పకుండా సాగదీయడం చాలా ముఖ్యం. ఇది భుజ కండరాలని బలోపేతం చేస్తుంది. టెన్సిన్ తగ్గించుకున్న కూడా శరీరం రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. మెడ, భుజాలు బలోపేతం చేయడం కోసం సాధారణ వ్యాయామం ద్వారా కండరాల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు వీపుని నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం. తప్పు భంగిమలు వెన్నెముక మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే భుజాలు వెనక్కి పెట్టుకుని చేసే వ్యాయామాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి మాత్రమే కాదు చేతి, ఛాతీ వ్యాయామాలు భుజం కండరాలు సాగదీస్తాయి. ఇలా చేయడం వల్ల బిగుతుగా ఉన్న భుజాలు బలహీనపడతాయి.
ఒత్తిడి తగ్గించే మార్గాలు
⦿పనుల్లో చురుకుగా ఉండాలి. భుజాలు ఉపయోగించి చేసే పనుల్లో యాక్టివ్ గా పార్టీసిపెట్ చేయాలి
⦿బద్ధకంగా ఉండకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంభించాలి
⦿రోజువారీ పనులు చేస్తున్నప్పుడు శరీరంపై శ్రద్ద వహించాలి. ఎక్కువసేపు కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే మీ పొజిషన్ మార్చుకుంటూ ఉండాలి. ప్రతి 30 నిమిషాలకు ఒక చిన్న విరామం తీసుకోవడం మంచిది.
⦿కుర్చీ, మానిటర్, కీబోర్డ్ ఎత్తును సరిగా ఉండేలా చూసుకోవాలి. డెస్క్ కి తగిన విధంగా చైర్ ని ఉంచుకోవాలి. భుజం ఎత్తి దాని మీద ఒత్తిడి కలిగే విధంగా తప్పుడు భంగిమలో కూర్చోవడం కరెక్ట్ కాదు.
⦿ఒత్తిడి స్థాయిలని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు వీలైనంత వరకు ప్రయత్నించాలి
⦿ఒత్తిడిని కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. అలాగే కండరాలు బలపడేందుకు తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి.
⦿భుజం నొప్పి తరచుగా వస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి. ఎందుకంటే గొంతు భుజం తీవ్రమైన పిత్తాశయ పరిస్థితికి సంకేతంగా ఉంటుంది. దీన్ని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. ఈ నొప్పి సాధారణంగా కుడి భుజం వైపు నుంచి పొట్ట ఎగువ వరకు అకస్మాత్తుగా వస్తుంది. శ్వాస తీసుకుంటుంటే నొప్పి మరింత తీవ్రంగా అనిపిస్తుంది. బైల్ అనే జీర్ణ రసం పిత్తాశయంలో చిక్కుకున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ షాంపూలో ఈ పదార్థాలు ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం!